IND vs ENG : ముంబైలోని వాంఖడే స్టేడియం భారత్ విజయనాదంతో మార్మోగిపోయింది. టీ20 ప్రపంచ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది.
ముంబైలో భారత్ జైత్రయాత్ర.. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ ఖేల్ ఖతం
వాంఖడేలో భారత్ విశ్వరూపం.. ఇంగ్లాండ్ పై సంజూ శాంసన్ సునామీ.. 253 పరుగుల భారీ లక్ష్యంతో బ్రిటిష్ జట్టు గుండెల్లో వణుకు పుట్టించింది టీమిండియా. ఉత్కంఠ పోరులో 7 పరుగుల తేడాతో విజయం సాధించి 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది భారత్. ముంబై లో ఇంగ్లాండ్ ఖేల్ ఖతం.. ఇక అహ్మదాబాద్‌లో భారత్ ఫైనల్ వేట మొదలు !
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్‌పై 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి ఘనంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో చివరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 253 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 246 పరుగుల వద్ద నిలిచిపోయింది.
25
శాంసన్ విధ్వంసం.. భారత్ భారీ స్కోరు
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా, భారత్‌కు ఆదిలోనే అభిషేక్ శర్మ (9) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. అయితే, ఓపెనర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 42 బంతుల్లోనే 89 పరుగులు (8 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతనికి ఇషాన్ కిషన్ (39), శివం దూబే (43) అద్భుత సహకారం అందించారు. చివర్లో హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచి 61 పరుగులు సమర్పించుకున్నాడు.
35
బౌలింగ్‌లో బుమ్రా, పాండ్యా పంజా
254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు. హార్దిక్ పాండ్యా తన మొదటి బంతికే ప్రమాదకరమైన ఫిల్ సాల్ట్ (5)ను అవుట్ చేసి భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. అనంతరం జస్ప్రీత్ బుమ్రా తన మొదటి బంతికే హ్యారీ బ్రూక్ (7)ను అవుట్ చేసి ఇంగ్లాండ్‌ను కష్టాల్లోకి నెట్టాడు. బట్లర్ (25) కాసేపు పోరాడినా వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒక దశలో ఇంగ్లాండ్ 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.
వరుసగా వికెట్లు పడుతున్నా, యంగ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన బెథెల్, ఇంగ్లాండ్‌కు గెలుపు ఆశలు రేకెత్తించాడు. అతను మొత్తం 48 బంతుల్లో 105 పరుగులు చేసి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో అదరగొట్టాడు. విల్ జాక్స్ (35)తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే 20వ ఓవర్ మొదటి బంతికి బెథెల్ రన్ అవుట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది.
55
చివరి ఓవర్ డ్రామా.. భారత్ విజయం
చివరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 30 పరుగులు అవసరమవ్వగా, శివం దూబే బౌలింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉన్న జోఫ్రా ఆర్చర్ మూడు సిక్సర్లు బాదినప్పటికీ, ఇంగ్లాండ్ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్ 246/7 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా, బుమ్రా, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది.