మరోవైపు పాకిస్థాన్ జట్టు కూడా విజయకాంక్షతో ఉంది. సల్మాన్ అలీ ఆఘా నాయకత్వంలోని పాక్ జట్టులో సీనియర్ ఆటగాడు బాబర్ ఆజం కీలకం కానున్నాడు.
పాకిస్థాన్ తుది జట్టు అంచనా: సైమ్ అయూబ్, బాబర్ ఆజం, సల్మాన్ మిర్జా, సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ తారిక్, అబ్రార్ అహ్మద్, సాహిబ్‌జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్).
కొలంబో పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి, ఇరు జట్ల స్పిన్ విభాగం మ్యాచ్ ఫలితాన్ని శాసించే అవకాశం ఉంది.