IND vs PAK: పాకిస్థాన్ స్పిన్ పద్మవ్యూహం.. భారత్ బ్యాటర్లు చిక్కుతారా? గెలుస్తారా?

Published : Feb 13, 2026, 10:33 PM IST

IND vs PAK: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు టీమిండియా బ్యాటర్లను స్పిన్ భయం వెంటాడుతోంది. మిడిల్ ఓవర్లలో పాక్ స్పిన్ త్రయాన్ని ఎదుర్కోవడం సూర్యకుమార్ సేనకు సవాలే. అయితే, భారత్ దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది.

PREV
16
IND vs PAK: పాకిస్థాన్‌తో పోరుకు ముందు భారత్‌కు స్పిన్ సెగ

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న హై వోల్టేజ్ పోరుకు సర్వం సిద్ధమైంది. అయితే, ఈ మెగా మ్యాచ్‌కు ముందు టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను ఒక బలహీనత తీవ్రంగా కలవరపెడుతోంది. 

నాణ్యమైన స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తడబడుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రూప్ ఏ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ, స్పిన్ ఎదుట భారత బ్యాటర్ల వైఫల్యం పాకిస్థాన్‌కు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

26
IND vs PAK : గణాంకాలు చెబుతున్న చేదు నిజం

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అమెరికా, నమీబియాతో జరిగిన గత రెండు మ్యాచ్‌లను గమనిస్తే, భారత బ్యాటర్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు తీయడానికి చాలా కష్టపడ్డారు. 2023 నుండి 2025 మధ్య కాలంలో టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత మిడిల్ ఆర్డర్ స్పిన్నర్లపై కేవలం 125-130 స్ట్రైక్ రేట్‌తో మాత్రమే పరుగులు చేస్తోంది. అదే పేస్ బౌలర్లపై భారత్ స్ట్రైక్ రేట్ 145కు పైగా ఉండటం గమనార్హం. గత రెండేళ్లలో మిడిల్ ఓవర్లలో (7-15) భారత్ కోల్పోయిన వికెట్లలో దాదాపు 45 శాతం స్పిన్నర్లకే దక్కడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

36
రిస్ట్ స్పిన్నర్ల ఉచ్చులో భారత వీరులు

భారత బ్యాటర్లు కేవలం టర్నింగ్ ట్రాక్‌లపైనే కాకుండా, సాధారణ పిచ్‌లపై కూడా రిస్ట్ స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్నారు. 2023 నుంచి గణాంకాలను పరిశీలిస్తే, లెగ్ స్పిన్నర్లపై భారత సగటు 28 కంటే తక్కువగా ఉంది. అదే ఫింగర్ స్పిన్నర్లపై ఈ సగటు 35 కంటే ఎక్కువగా ఉంది. పాకిస్థాన్ జట్టులో షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్ వంటి నాణ్యమైన రిస్ట్ స్పిన్నర్లు ఉండటం భారత్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో పాక్ స్పిన్నర్లు ఎప్పుడూ ముందుంటారు.

46
IND vs PAK : పాకిస్థాన్ స్పిన్ అస్త్రాలు ఇవే

2021 నుంచి ఐసీసీ టీ20 ఈవెంట్లలో పాకిస్థాన్ స్పిన్నర్లు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. వారు ఓవర్‌కు సగటున 7.5 కంటే తక్కువ పరుగులు మాత్రమే ఇస్తున్నారు. ముఖ్యంగా షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్, మహమ్మద్ నవాజ్ వంటి నలుగురు వైవిధ్యమైన స్పిన్నర్లతో పాక్ సిద్ధంగా ఉంది. వీరు లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, మిస్టరీ డెలివరీలు, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్‌తో భారత బ్యాటర్లను కట్టడి చేయగలరు. డెత్ ఓవర్ల కంటే ముందే భారత పవర్ హిట్టర్లను ఒత్తిడిలోకి నెట్టడమే పాక్ వ్యూహంగా కనిపిస్తోంది.

56
సూర్య, హార్దిక్‌లపైనే భారత్ ఆశలు

స్పిన్ ముప్పు పొంచి ఉన్నప్పటికీ, భారత్ వద్ద ఈ సవాల్‌ను స్వీకరించగల ఇద్దరు కీలక ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 2022 నుండి స్పిన్నర్లపై 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో చెలరేగుతున్నాడు. 360 డిగ్రీల షాట్లతో స్పిన్నర్లను దెబ్బతీయడంలో సూర్య దిట్ట. మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా డెత్ ఓవర్లలో స్పిన్‌పై 160కి పైగా స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడుతున్నాడు. వీరిద్దరూ నిలబడితే పాక్ స్పిన్ వ్యూహం తలకిందులవ్వడం ఖాయం. అయితే, మిగిలిన బ్యాటర్లు కూడా వీరికి సహకరించాల్సిన అవసరం ఉంది.

66
స్పిన్‌ను ఎదుర్కోవడానికి టీమిండియా ప్లానేంటి?

పాకిస్థాన్ స్పిన్ ఉచ్చు నుండి బయటపడాలంటే భారత బ్యాటర్లు మరింత దూకుడుగా వ్యవహరించాలి. స్పిన్నర్ల లెంగ్త్‌ను దెబ్బతీయడానికి స్వీప్ షాట్లు ఆడటం, క్రీజును సమర్థంగా వాడుకుంటూ టర్న్‌ను తగ్గించడం వంటి వ్యూహాలను అనుసరించాలి. కేవలం భారీ షాట్లకే పరిమితం కాకుండా సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేయడం వల్ల బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే లెఫ్ట్-రైట్ కాంబినేషన్ బ్యాటింగ్‌ను కొనసాగించడం ద్వారా పాక్ స్పిన్నర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను చెదరగొట్టవచ్చని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories