సాధారణంగా జట్టులోకి ఇలా వచ్చిన సభ్యుడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కదు. కానీ బుమ్రా అస్వస్థత వల్ల నేరుగా ప్లేయింగ్ ఎలెవన్‌లో సిరాజ్‌కు చోటు దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సిరాజ్ పవర్ ప్లేలోనే వికెట్లు తీసి యూఎస్ఏ దెబ్బ తీశాడు. 3/29తో అదరగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇదంతా దేవుడు రాసిన రాత అని.. దానిని ఎవరూ మార్చలేరు అంటున్నాడు హైదరాబాదీ మియా..