IND vs NZ : గెలుపు కోసం ఆ హోటల్ మార్చేసిన టీమిండియా.. సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

Published : Mar 07, 2026, 05:16 PM IST

ICC Men's T20 World Cup 2026 : 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తాలూకు చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే ఈసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం టీమిండియా ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతోంది. 

PREV
17
టీమిండియా సెంటిమెంట్

క్రికెట్ లో అద్భుతమైన ఆటగాళ్లు జట్టులో ఉన్నా గెలవాలంటే ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఇందుకోసమే ఒక్కో జట్టు ఒక్కో రకమైన సెంటిమెంట్ ఫాలో అవుతుంటాయి. తాజాగా టీమిండియా కొత్త సెంటిమెంట్ ఫాలో అవుతోంది. ఇది టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో గెలుపు అందిస్తున్నందని నమ్ముతున్నారు. 

27
హోటల్ మార్చేశారుగా...

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ మొదలైంది. మార్చి 8న అంటే రేపు ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈసారి అద్భుత ప్రదర్శనతో పాటు, టీమిండియా కొన్ని నమ్మకాలను కూడా ఫాలో అవుతోంది. అందులో భాగంగానే అహ్మదాబాద్ లో మ్యాచ్ సందర్భంగా బసచేసే హోటల్ ను ఈసారి మార్చేశారు… కొత్త హోటల్లో దిగారు.

37
2023 ఓటమే కారణం..

చాలా మంది క్రీడాకారులకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ప్యాడ్స్ కట్టుకునేటప్పుడు ఎడమ కాలికి ముందు కట్టడం, డగౌట్‌లో కూర్చోవడం వంటివి చేస్తుంటారు. ఇప్పుడు టీమిండియా కూడా 2023 ఫైనల్ ఓటమిని దృష్టిలో పెట్టుకుని, ఫైనల్‌కు ముందు బస చేసే హోటల్‌ను మార్చేసింది.

47
స్టేడియం కూడా అంతగా కలిసిరాలేదు..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం టీమిండియాకు అంతగా కలిసిరాలేదు. 2023 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇక్కడే ఓడిపోయింది. ఈ టోర్నీ సూపర్ 8 దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి తప్పలేదు. అందుకే ఈసారి ఫైనల్ కోసం రోజూ ఉండే హోటల్‌ను మార్చేశారు.

57
గ్రహణం వేళ ప్రాక్టీస్ వాయిదా

మార్చి 3న గ్రహణం సమయంలో టీమిండియా తమ ప్రాక్టీస్‌ను ఆపేసింది. సుమారు 45 నిమిషాల పాటు జట్టు ప్రాక్టీస్‌కు దూరంగా ఉంది. ఎలాంటి నెగటివ్ ఎనర్జీ జట్టును తాకకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

67
రెడ్ లేదా బ్లాక్ పిచ్

అహ్మదాబాద్‌లో మూడు రకాల పిచ్‌లు ఉన్నాయి. సూపర్ 8 దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్లాక్ పిచ్‌పై ఆడి ఓడిపోయింది. అదే ముంబైలో రెడ్ పిచ్‌పై ఆడితే భారీ విజయం సాధించింది. అందుకే ఫైనల్‌కు కూడా రెడ్ పిచ్‌నే ఎంచుకోవాలని జట్టు భావిస్తున్నట్లు సమాచారం.

77
ట్రోఫీపై కన్నేసిన టీమిండియా

టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది. కఠినమైన సెమీఫైనల్‌లో గెలిచి టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఇప్పుడు కొన్ని సెంటిమెంట్లను పాటిస్తూ, మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories