కామన్వెల్త్ గేమ్స్ 2030 హైదరాబాద్ లో జరుగుతాయా?

Published : Aug 28, 2025, 06:23 PM IST

అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ సిటీగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్ ను కామన్వెల్త్  గేమ్స్ 2030 ఊరిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఈ గేమ్స్ నిర్వహణకు సిద్దమైన నేపథ్యంలో హైదరాబాద్ ఇందుకు సరైన వేదిక అనే చర్చ జరుగుతోంది. 

PREV
16
కామన్వెల్త్ గేమ్స్ 2030 ఎక్కడ?

Commonwealth Games 2030 : హైదరాబాద్‌ నగరం ఇప్పుడు టెక్‌ హబ్‌గా మాత్రమే కాకుండా ప్రపంచ క్రీడా గమ్యస్థానంగా కూడా అవతరిస్తోంది. అంతర్జాతీయ స్థాయి క్రీడలకోసం మౌలిక సదుపాయాలు కల్పన, ప్రతిష్టాత్మక ఈవెంట్స్ నిర్వహణతో నగరాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ మ్యాప్‌పై నిలబెట్టే ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా యావత్ దేశమే మనవైపు చూసేలా స్పోర్ట్స్ పాలసీని ప్రకటించింది... చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ రాణించేలా యువతను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోనే బలమైన క్రీడావేదిక ఏదంటే తెలంగాణ గుర్తుకువచ్చేలా రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని అమలుచేస్తామంటోంది ప్రభుత్వం.

ఇలా తెలంగాణ రాష్ట్రం క్రీడాభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న సమయంలోనే కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 2030 కామన్వెల్త్ గేమ్స్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్దమవుతోంది.. ఈ మేరకు బిడ్ దాఖలు చేసేందుకు అధికారిక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్ లో కామన్వెల్త్ గేమ్స్, 2030 నిర్వహణపై చర్చ జరిగింది... బిడ్ దాఖలు చేయాలని నిర్ణయించారు. కానీ ఈ క్రీడలను గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్వహించాలని ప్రతిపాదించారు.

26
అహ్మదాబాద్ తో హైదరాబాద్ పోటీ

అంతర్జాతీయస్థాయి క్రీడా సౌకర్యాలు ఉన్నాయికాబట్టే అహ్మదాబాద్ లో కామన్వెల్త్ గేమ్స్ 2030 నిర్వహించాలని భావిస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. అయితే హైదరాబాద్ ఈ విషయంలో అహ్మదాబాద్ తో గట్టి పోటీ ఇవ్వగలదు. ఇప్పటికే హైదరాబాద్ పలు జాతీయ, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్స్ కు వేదికయ్యింది... భవిష్యత్ లో మరిన్ని జరగనున్నాయి. తెలంగాణలో క్రీడాభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభత్వం చెబుతోంది. అంటే మరో ఐదేళ్లలలో హైదరాబాద్ స్పోర్ట్స్ హబ్ గా మారబోతోంది... మరి ఇక్కడ కామన్వెల్త్ గేమ్స్ 2030 ఎందుకు నిర్వహించకూడదు? అనే ప్రశ్న తెలుగు ప్రజల నుండి వస్తోంది.

ఇప్పటికే హైదరాబాద్ లో సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన క్రీడా ఈవెంట్స్ ను ఈ సందర్భంగా తెలుగు ప్రజలు గుర్తుచేస్తున్నారు. ప్రతిఏటా ఇలాంటి కొన్ని క్రీడా ఈవెంట్స్ ఈ నిజాంల నగరంలో జరుగుతుంటాయి. అలాంటివాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం…

36
ఫార్ములా ఈ-రేస్ (Hyderabad ePrix)

ఇండియాలో మొట్టమొదటి ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన నగరంగా హైదరాబాద్ నిలిచింది. 2023 ఫిబ్రవరి 11న హుస్సెన్ సాగర్ తీరంలో ఏర్పాటుచేసిన స్ట్రీట్ సర్క్యూట్ పై రేసింగ్ కార్లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లాయి… ఇలా ఫార్ములా ఈ రేసు సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఈ గేమ్స్ గురించి చర్చ జరిగింది.

అయితే ప్రతిఏటా ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు నిర్ణయించారు. కానీ వివిధ కారణాలతో 2024 లో ఈ రేసును రద్దుచేశారు. భవిష్యత్ లో ఫార్ములా ఈ రేస్ ను కొనసాగిస్తారో లేదో తెలీదుగానీ మొదటిసారేే ఇది సూపర్ సక్సెస్ కావడంతో హైదరాబాద్ ప్రపంచం దృష్టిలో పడింది... తద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

46
గోల్కొండలో PGTI గోల్ఫ్ టూర్

హైదరాబాద్ చరిత్రకు నిలయమైన గోల్కొండ కోట పరిసరాల్లోనే జాతీయ స్థాయి గోల్ఫ్ టోర్నమెంట్ జరుగుతుంది. ప్రొఫెషనల్ గోల్ప్ టూర్ ఆఫ్ ఇండియా (PGTI) లో భాగంగా తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ పేరిట జరిగే ఈ టోర్నమెంట్ లో జాతీయ, అంతర్జాతీయస్థాయి గోల్ఫర్స్ హాజరవుతారు. దీన్ని హైదరాబాద్ గోల్ప్ అసోసియేషన్ (HGA) నిర్వహిస్తుంది. ఇది వారసత్వం, లగ్జరీ స్పోర్ట్స్ కలయికతో ఒక ప్రత్యేకమైన క్రీడా ఉత్సవంగా నిలుస్తుంది.

56
ATP, WTA టెన్నిస్ టూర్లు

హైదరాబాద్ బ్యాడ్మింటన్, టెన్నిస్ హబ్ గుర్తింపుపొందింది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... బ్యాడ్మింటన్ స్టార్లు పివి సింధు వంటివారు ఈ నగరానికి చెందినవారే. ఇలాంటి క్రీడాకారులను అందించిన నగరంలో మరెందరో టాలెంటెడ్స్ ఉన్నారు... వారిని గుర్తించేందుకు అనేక క్రీడా ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇలా నగరంలో ATP,  WTA అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్ల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. తద్వారా స్థానిక ప్రతిభను ప్రేరేపించడంతో పాటు ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ఆకర్షించే అవకాశం ఉంది.

66
హైదరాబాద్ ఇంటర్నేషనల్ మారథాన్

హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ వెంబడి జరగనున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ మారథాన్ బోస్టన్, లండన్‌లతో సమానమైన ప్రఖ్యాతిని తెచ్చేలా ఉండనుంది. హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ (HRS) ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది... ఇందులో వేలాదిమంది పాల్గొంటారు.

టెక్ హబ్ నుండి స్పోర్ట్స్ క్యాపిటల్ వైపు

భారతదేశ టెక్ హబ్‌గా పేరొందిన హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ క్రీడా రాజధానిగా ఎదగడానికి సిద్ధమవుతోంది. పలు అంతర్జాతీయ ఈవెంట్లు, క్రీడా మౌలిక సదుపాయాలతో ఈ నగరం క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించనుంది. మరి కామన్వెల్త్ గేమ్స్ 2030 అవకాశం కూడా ఈ నగరానికి ఏమైనా వస్తుందేమో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories