Daniil Medvedev: యూఎస్ ఓపెన్ 2025 లో రష్యా స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు డానియెల్ మెద్వెదేవ్ మరోసారి ఆగ్రహం ప్రదర్శించారు. ఫ్రాన్స్ ఆటగాడు బెంజమిన్ జరిగిన హోరాహోరీ పోరులో ఓడిపోవడంతో అసభ్యకర ప్రవర్తించారు. దీంతో ఏకంగా 42,500 డాలర్ల జరిమానా విధించారు.
రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్ మరోసారి తన ఆగ్రహావేశంతో వార్తల్లో నిలిచాడు. యూఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే ఫ్రాన్స్ ఆటగాడు బెంజమిన్ బోంజి చేతిలో ఓటమి పాలైన అనంతరం కోర్టులో అనుచిత ప్రవర్తించారు. అతడి అసభ్యకర ప్రవర్తనపై టోర్నమెంట్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా 42,500 డాలర్ల జరిమానా (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 37 లక్షలు) విధించారు. ఇంతకీ ఏం జరిగింది? అలా ప్రవర్తించడానికి గల కారణమేంటీ?
26
ఉత్కంఠ పోరులో ఓటమి
యూఎస్ ఓపెన్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో రష్యా స్టార్ ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ ఓటమి పాలయ్యారు. ఐదు సెట్ పాటు సాగిన ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 6-3, 7-5, 6-7(5), 0-6, 6-4 తేడాతో ఫ్రాన్స్ ప్లేయర్ బెంజమిన్ బోంజి చేతిలో ఓటమి పాలయ్యాడు. వాస్తవానికి తొలి రెండు సెట్లను ఓటమి పాలైన.. మూడో సెట్ లో దూకుడుగా వ్యవహరించారు. టైబ్రేకర్‌లో విజయం సాధించారు. ఇక నాలుగో సెట్లో బోంజమిన్ కు ఒక్క పాయింట్ ఇవ్వకుండా 6-0తో గెలిచి మ్యాచ్‌ను సమంగా నిలిపాడు. అయితే ఐదో సెట్లో అనూహ్యంగా బోంజమిన్ విజయం సాధించారు. దీంతో డానిల్ మెద్వెదెవ్ కు ఓటమి తప్పలేదు.
36
అసహనానికి కారణమదేనా?
ఈ ఉత్కఠ పోరులో ఓ అనుకోని ఘటన జరిగింది. మూడో సెట్లో కీలక సమయంలో మెద్వెదెవ్ ఆధిపత్యం చూపుతుండగా ఒక ఫోటోగ్రాఫర్ ఆటకు ఆటంకం కలిగించాడు. దీంతో ఆరు నిమిషాలపాటు ఆట నిలిపివేశారు. ఈ సమయంలో చెయిర్ అంపైర్ గ్రెగ్ అలెన్స్‌వర్త్ బోంజికి మళ్లీ సర్వీస్ చేసే అవకాశం ఇచ్చారు. ఈ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మెద్వెదెవ్ నేరుగా అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
ప్రేక్షకులు కూడా అతడ్ని హేళన చేస్తూ కోపం తెప్పించారు. దీంతో మెద్వెదెవ్ మైదానంలో గట్టిగా అరిచారు. నాలుగో సెట్లో గెలిచిన తర్వాత కూడా తన కోపం తగ్గలేదు. అసభ్యసైగలు చేసి మరింత విమర్శలకు గురయ్యాడు. చివరగా ఓటమి తట్టుకోలేక రాకెట్‌ను కోర్టులోనే విరగొట్టాడు.
మెద్వెదెవ్ ప్రవర్తనపై టోర్నమెంట్ నిర్వాహకులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు 30,000 డాలర్లు, అందరి ముందు మైదానంలో రాకెట్‌ను విరగొట్టినందుకు 12,500 డాలర్ల ఫైన్ విధించారు.
ఇలా మొత్తం 42,500 డాలర్ల ఫైన్ విధించారు. భారత కరెన్సీలో దాదాపు రూ.37 లక్షలు. తొలి రౌండ్‌లో ఆడినందుకు వచ్చే 110000 డాలర్ల ప్రైజ్‌మనీలో ఈ జరిమానా మూడో వంతుకు పైగా కావడం గమనార్హం.
56
విమర్శలు
మెద్వెదెవ్ ప్రవర్తనపై పలువురు టెన్నిస్ దిగ్గజాలు స్పందించారు. జర్మనీకి చెందిన లెజెండరీ ఆటగాడు బోరిస్ బెకర్ మాట్లాడుతూ, “ప్రేక్షకులు ఎంత రెచ్చగొట్టినా క్రీడాకారుడు ఓర్పుతో ఉండాలి. ఆగ్రహం కంటే ఆత్మస్థైర్యం ముఖ్యం” అని సూచించారు. అలాగే మెద్వెదెవ్ సహచరుడు రష్యా ఆటగాడు ఆండ్రే రుబ్లెవ్ కూడా స్పందిస్తూ “కోర్టులో భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. లేని పక్షంలో ఆట దెబ్బతింటుంది” అని వ్యాఖ్యానించాడు.
66
వరుస పరాజయాలతో నిరాశ
వరుసగా పరాజయాలు ఎదుర్కొంటూ రష్యా స్టార్ ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. ఈ ఏడాది అతని ప్రదర్శన ఒక్క టోర్నీలోనూ విజయం సాధించకపోవడంతో అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లోనే వెనుదిరిగిన మెద్వెదెవ్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లలో తొలి రౌండ్‌లోనే ఔట్ అయ్యాడు.
తాజాగా యూఎస్ ఓపెన్‌లోనూ మొదటి రౌండ్‌లోనే ఓటమి పాలవడం అతని కెరీర్‌లో కఠిన దశగా మారింది. వరుస గ్రాండ్‌స్లామ్‌లలో ప్రారంభ దశలోనే నిష్క్రమించడంతో అతడి ఆటతీరు, మానసిక స్థైర్యంపై ప్రశ్నలు లేవనెత్తున్నాయి.