Hockey: ఇదికదా మ్యాచ్ అంటే.. 10 మంది ప్లేయ‌ర్ల‌తోనే గ్రేట్ బ్రిటన్ ను చిత్తుచేసిన భార‌త్

First Published | Aug 4, 2024, 4:12 PM IST

Hockey Great Britain vs India : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. పెనాల్టీ షూటౌట్‌లో భారత్ 4-2తో గ్రేట్ బ్రిటన్‌ను ఓడించి సెమీ ఫైనల్‌ చేరుకుంది. ఇదికదా మ్యాచ్ అనేలా చివరి వరకు ఇరు జట్లు అద్భుతంగా గెలుపుకోసం పోరాడాయి. 
 

Hockey, Indian hockey team, Team India at Paris Olympics

Hockey Great Britain vs India : పారిస్ ఒలింపిక్స్ లో భార‌త హాకీ జ‌ట్టు అద్భుత‌మైన పోరాటం చేసింది. 10 మంది ప్లేయ‌ర్ల‌తోనే బ‌ల‌మైన గ్రేట్ బ్రిట‌న్ జ‌ట్టు చేతిలోకి మ్యాచ్ వెళ్ల‌కుండా మ‌న ప్లేయ‌ర్లు ఆడిన తీరు ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. ఇరు జ‌ట్లు పూర్తి స‌మ‌యం ఆడిన త‌ర్వాత 1-1తో స‌మంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ షూటౌట్ కు వెళ్లింది. విజేత‌ను నిర్ణ‌యించ‌డానికి జ‌రిగిన షూటౌట్ లో నూ భార‌త ప్లేయ‌ర్లు అద్భుతంగా గోల్స్ చేసి గ్రేట్ బ్రిట‌న్ కు షాకిచ్చారు. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో పురుషుల హాకీ క్వార్టర్-ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్‌లో గ్రేట్ బ్రిటన్‌ను భారత్ 4-2తో ఓడించింది. 

Indian Hockey Team

అద్భుత పోరాటమిది..

ఈ గెలుపుతో భార‌త జ‌ట్టు వరుసగా రెండోసారి ఒలింపిక్ సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. నిర్ణీత సమయానికి మ్యాచ్ 1-1తో టై కావడంతో షూటౌట్‌కు వెళ్లింది. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో క్వార్టర్-ఫైనల్స్‌లో భారత్ 3-1తో గ్రేట్ బ్రిటన్‌ను ఓడించింది. అక్క‌డ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు మ‌రోసారి పారిస్ లోనూ గ్రేట్ బ్రిట‌న్ కు షాకిచ్చింది భార‌త హాకీ జ‌ట్టు. కాగా, ఈ మ్యాచ్ లో భారత హాకీ క్రీడాకారుడు అమిత్ రోహిదాస్ కు రెడ్ కార్డ్ ఇవ్వ‌డంతో 10 మంది ప్లేయ‌ర్ల‌తోనే భార‌త జ‌ట్టు 42 నిమిషాల పాటు ఆడింది. అయినా ఏ స‌మ‌యంలోనూ మ్యాచ్ ను జారిపోకుండా కాపాడుకోవ‌డం విశేషం. మ‌రో గొప్ప విష‌యం ఏమిటంటే సీనియ‌ర్ ప్లేయ‌ర్ శ్రీజేష్ మ‌రోసారి త‌న ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించాడు. గ్రేట్ బ్రిట‌న్ ఆడిన 11 షాట్స్ లో 10 అత‌ను అడ్డుకున్నాడు. దీంతో పూర్తి స‌మ‌యంలో 1-1తో ఇరు జ‌ట్ల స‌మంగా నిలిచాయి.

Latest Videos


పెనాల్టీ షూటౌట్‌లో భారత్ గెలుపు

మొత్తం 42 నిమిషాల పాటు పది మంది ఆటగాళ్లతో ఆడినప్పటికీ భారత హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేసి పెనాల్టీ షూటౌట్‌లో బ్రిటన్‌ను 4-2తో ఓడించి పారిస్ ఒలింపిక్స్ 2024 సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. నిర్ణీత సమయానికి మ్యాచ్ 1-1తో టైగా ఉండడంతో పెనాల్టీ షూటౌట్ జరిగింది. ఇందులో భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్‌జిత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, రాజ్‌కుమార్ పాల్ గోల్స్ చేయగా, పీఆర్ శ్రీజేష్ బ్రిటన్ రెండు షాట్లను అడ్డుకున్నాడు. 

10 మంది ఆటగాళ్లతో 42 నిమిషాల ఆడిన భార‌త్

ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 10 మంది ఆటగాళ్లతో 42 నిమిషాల పాటు ఆడింది, ఎందుకంటే అమిత్ రోహిదాస్‌కు రెడ్ కార్డ్ ఇవ్వ‌డంతో అత‌ను బ‌య‌ట ఉండాల్సి వ‌చ్చింది. 10 మంది ప్లేయ‌ర్ల‌తో కూడా భార‌త్ మ్యాచ్ ను చేజార‌కుండా కాపాడుకుంది. వ‌రుస‌గా రెండో సారి (టోక్యో, పారిస్) బ్రిట‌న్ ను ఓడించి భారత జట్టు సెమీస్ కు చేరుకుంది. 

click me!