Hardik Pandya: హార్దిక్ పాండ్యా వాటిని తీసుకున్నాడా? చిల్లర వేషాలతో చిక్కుల్లో టీమిండియా స్టార్

Published : Mar 13, 2026, 07:59 PM ISTUpdated : Mar 13, 2026, 08:11 PM IST

Hardik Pandya Drug Test Controversy : టీ20 ప్రపంచ కప్ 2026 గెలిచిన ఆనందంలో హార్దిక్ పాండ్యా ప్రవర్తనపై పాక్ మాజీ కెప్టెన్ ఆఫ్రీదీ మాదకద్రవ్యాలు తీసుకున్నాడనే  అనుమానాలు వ్యక్తం చేయగా, జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో పాండ్యాపై కేసు నమోదైంది.

PREV
16
ప్రపంచ కప్ గెలిచిన జోష్‌లో హద్దులు దాటిన పాండ్యా?

టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా చరిత్రాత్మక విజయం సాధించి, యావత్ భారతదేశాన్ని గర్వపడేలా చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే, ఈ విజయ గర్వంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రవర్తన ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రీదీ చేసిన వ్యాఖ్యలు, పాండ్యాపై నమోదైన పోలీసు కేసు క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

26
పాండ్యాకు మత్తుమందు టెస్ట్ చేయాల్సిందే.. షాహిద్ ఆఫ్రీదీ సంచలన ఆరోపణలు

విజయం తర్వాత మైదానంలో హార్దిక్ పాండ్యా ప్రవర్తించిన తీరుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాండ్యా అసాధారణంగా గంతులు వేయడం, అతిగా ప్రవర్తించడం చూస్తుంటే అతను ఏదైనా మాదకద్రవ్యాల ప్రభావంలో ఉన్నాడేమోనని ఆఫ్రీదీ అనుమానం వ్యక్తం చేశారు. "ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యాకు మాదకద్రవ్యాల టెస్ట్ నిర్వహించాల్సింది. అతని బ్యాటింగ్ తీరు, మైదానంలో ప్రవర్తన చూస్తుంటే ఏదో క్రేజీ ఇన్ ఫ్లూయెన్స్ లో ఉన్నట్లు అనిపిస్తోంది" అంటూ ఆఫ్రీదీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి.

36
ఐసీసీ బాస్ ముందే పాండ్యా కుప్పిగంతులు.. మర్యాద లేదా?

కేవలం ఆటపైనే కాకుండా, స్టేడియంలో ఉన్న ప్రముఖుల పట్ల పాండ్యా వ్యవహరించిన తీరును కూడా ఆఫ్రీదీ తప్పుబట్టారు. ఐసీసీ బాస్ జై షా ముందు పాండ్యా చేసిన ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "జై షా అన్ని క్రికెట్ బోర్డులకు అధిపతి. ఆయన పట్ల గౌరవం ఉండాలి. కానీ హార్దిక్ జాతీయ జెండాను కప్పుకుని ఆయన ముందు చిల్లర వేషాలు వేశాడు. జై షా భారతీయుడైనప్పటికీ, ఆయన హోదాను పాండ్యా మరిచిపోయాడు" అని ఆఫ్రీదీ విమర్శించారు. మరికొంత మంది కూడా పాండ్యా తీరును తప్పుపడుతున్నారు.

46
జాతీయ జెండాకు అవమానం.. చట్టపరమైన చిక్కుల్లో పాండ్యా

హార్దిక్ పాండ్యాను కేవలం విమర్శలే కాకుండా, చట్టపరమైన ఇబ్బందులు కూడా చుట్టుముట్టాయి. తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి మైదానంలో వేడుకలు జరుపుకుంటున్న సమయంలో, ఒంటిపై జాతీయ జెండాను కప్పుకుని నేలపై పడుకోవడం వివాదానికి దారితీసింది. దీనిపై పూణేకు చెందిన ఒక న్యాయవాది బెంగళూరులోని శివాజీనగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జాతీయ జెండా గౌరవ మర్యాదలకు భంగం కలిగించారని, 1971 జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం కింద పాండ్యాపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో నేరం నిరూపితమైతే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

56
మహికా శర్మతో రొమాన్స్.. కుటుంబంలో విభేదాలు?

నటాషా స్టాంకోవిచ్‌తో విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా జీవితంలోకి మోడల్ మహికా శర్మ ప్రవేశించింది. ఫైనల్ మ్యాచ్ విజయం తర్వాత పాండ్యా ఆమెను తన లక్కీ చార్మ్ అని అభివర్ణించారు. అయితే, ఇదే సమయంలో హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా, వదిన పంఖురి శర్మలు ఈ విజయంపై సోషల్ మీడియాలో మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మహికా రాకతోనే పాండ్యా సోదరుల మధ్య దూరం పెరిగిందని, గతంలో ఎంతో కలిసున్న ఈ కుటుంబం ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అలాగే, టీమ్ ఫోటో సెషన్ సందర్భంగా మహికాను అక్కడి నుంచి వెళ్లమని ఐసీసీ సిబ్బంది సూచించినా వెళ్లలేదనే విమర్శలు కూడా ఆమె పై వస్తున్నాయి.

66
హార్దిక్ పాండ్యా : విమర్శల నుంచి విజయ శిఖరాల వరకు

వివాదాలు ఒకవైపు ఉన్నప్పటికీ, హార్దిక్ పాండ్యా ఆటతీరును తక్కువ అంచనా వేయలేం. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ప్రేక్షకుల నుండి వచ్చిన అపవాదులు, అవమానాలను తట్టుకుని ఈ వరల్డ్ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అలాగే, గుజరాత్ టీమ్ అద్భుతంగా ముందుకు నడిపించాడు. తన చిన్ననాటి కోచ్ జితేంద్ర సింగ్ పర్యవేక్షణలో కఠిన శిక్షణ పొంది, పాత హార్దిక్ పాండ్యాను తలపించేలా రాణించారు. 160కి పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Read more Photos on
click me!

Recommended Stories