టెస్టుల్లో తోపు.. కట్ చేస్తే.. టీ20ల్లో తుస్సుమన్న గిల్.. 2025 జాతకం ఇదే.!

Published : Jan 01, 2026, 06:33 PM IST

Shubman Gill: 2025 శుభ్‌మాన్ గిల్‌కు అటు తీపి.. ఇటు చేదును అందించింది. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచిన గిల్, కెప్టెన్సీ పగ్గాలు కూడా అందుకున్నాడు. అయితే, టీ20 ఫార్మాట్‌లో దారుణంగా విఫలమై.. 

PREV
15
అటు తీపి.. ఇటు చేదు..

2025వ సంవత్సరం టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ కెరీర్‌లో అటు తీపి.. ఇటు చేదును అందించింది. ఈ ఏడాది గిల్ అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్లాడు. ఛాంపియన్స్ ట్రోఫీ మొదలుకుని ఇంగ్లాండ్ టూర్ వరకు బ్యాట్‌తో రాణించాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న గిల్.. వన్డే ఫార్మాట్‌లో కూడా సారధ్య బాధ్యతలు చేపట్టాడు.

25
టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు..

2025లో టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. గిల్ 16 ఇన్నింగ్స్‌లలో 70.21 సగటుతో 983 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీలు, డబుల్ సెంచరీలతో గిల్ దూసుకుపోవడమే ఈ రికార్డుకు ప్రధాన కారణం. గిల్ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ ఉన్నాడు.

35
హెడ్ పరుగులు ఇలా..

ట్రావిస్ హెడ్ 21 ఇన్నింగ్స్‌లలో 40.85 సగటుతో 817 పరుగులు చేశాడు. టీమిండియా ఓపెనర్ కె.ఎల్. రాహుల్ 19 ఇన్నింగ్స్‌లలో 45.16 సగటుతో 813 పరుగులు చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్ 18 ఇన్నింగ్స్‌లలో 50.31 సగటుతో 805 పరుగులు చేయగా, హ్యారీ బ్రూక్ 18 ఇన్నింగ్స్‌లలో 45.35 సగటుతో 771 పరుగులు సాధించి ఐదో స్థానంలో ఉన్నారు.

45
మెడ గాయంతో గిల్ బయటకు..

సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో మెడ గాయంతో గిల్ మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. ఆ గాయం కారణంగా రెండో టెస్టుకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ రెండు టెస్టులు ఆడి ఉంటే గిల్ సునాయాసంగా వెయ్యి పరుగుల మార్కును అందుకునేవాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్ టూర్ వరకు విజయవంతంగా కొనసాగిన గిల్ ప్రస్థానం.. సౌతాఫ్రికా టూర్‌తో పతనమైంది.

55
టీ20 ఫార్మాట్‌లో మాత్రం..

ముఖ్యంగా టెస్టులు, వన్డేలలో రాణించినప్పటికీ, టీ20 ఫార్మాట్‌లో మాత్రం గిల్ దారుణంగా విఫలమయ్యాడు. ఆసియా కప్ నుంచి ఆస్ట్రేలియా సిరీస్, సౌతాఫ్రికా సిరీస్‌లలో తక్కువ పరుగులకే ఔటయ్యాడు. ఫలితంగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో తన చోటును కోల్పోయాడు. 2025వ సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించిన గిల్‌కు ముగింపు మాత్రం నిరాశనే ఇచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories