సిరాజ్ గాయంపై స్పష్టత రావాల్సి ఉండగా, టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ జట్టులోని ఇతర బౌలర్లపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై ఆయన ప్రశంసలు కురిపించారు. "వరుణ్ మా జట్టులో ప్రధాన వికెట్ టేకర్. ఈ ప్రపంచకప్‌లో అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. బుమ్రాతో కలిసి అతను ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలడు" అని మోర్కెల్ పేర్కొన్నారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో సిరాజ్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది మ్యాచ్ కు ముందు వెల్లడయ్యే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచకప్ 2026 - భారత జట్టు :
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.