KKR Rinku Singh : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ చేతిలో కేకేఆర్ ఓటమిపాలైంది. ఒక స్టార్ బ్యాటర్ ఇప్పుడు విలన్ గా మారాడు. రింకూ సింగ్ పేలవ ఫామ్ జట్టును కష్టాల్లోకి నెట్టింది. అసలు ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.
IPL 2026: ఫినిషర్ నుంచి విలన్‌గా మారిన రింకూ సింగ్.. కేకేఆర్‌కు తప్పని ఓటమి!
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై గుజరాత్ టైటాన్స్ (GT) 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో కేకేఆర్ శిబిరంలో ఆందోళన మొదలైంది, ముఖ్యంగా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ వైఫల్యం జట్టును వేధిస్తోంది.
25
వరుసగా విఫలమవుతున్న రింకూ సింగ్
కేకేఆర్ జట్టులో ఫినిషర్ హోదాలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన రింకూ సింగ్, ఈ మ్యాచ్‌లో మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన ఆయన, కేవలం 2 బంతులు ఆడి 1 పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. 14.5 ఓవర్లలో కేకేఆర్ స్కోరు 147/5 వద్ద ఉన్నప్పుడు రింకూ సింగ్ ఏడవ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉన్న కేమరూన్ గ్రీన్ తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పుతాడని భావించినా, కగిసో రబాడా వేసిన ఓవర్లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ సీజన్‌లో రింకూ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
35
రింకూ సింగ్ దారుణమైన ఫామ్.. గణంకాలు ఇవే
ఐపీఎల్ 2026లో రింకూ సింగ్ ఫామ్ అత్యంత దారుణంగా ఉంది. గత ఆరు మ్యాచ్‌లలో ఆయన చేసిన పరుగులు వరుసగా 33*, 35, 4, 6, 1. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం 19.75 సగటుతో 79 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు కేవలం 35 పరుగులు మాత్రమే కావడం గమనార్హం.
గతంలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించిన రింకూ, ఇప్పుడు మాత్రం జట్టుకు భారంలా మారుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ కెరీర్ మొత్తంలో 64 మ్యాచ్‌ల్లో 29.45 సగటుతో 1178 పరుగులు చేసిన రింకూ, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగే అర్హత కోల్పోతున్నాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ అజింక్యా రహానే ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా, అంగ్క్రిష్ రఘువంశీ (8 పరుగులు), టీమ్ సీఫెర్ట్ (19 పరుగులు) కూడా నిరాశపరిచారు. అయితే, ఒకవైపు వికెట్లు పడుతున్నా కేమరూన్ గ్రీన్ మాత్రం మంచి నాక్ ఆడాడు. 55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి ఈ సీజన్‌లో తన మొదటి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. రొవ్‌మన్ పావెల్ 27 పరుగులు చేసినా, రింకూ సింగ్, ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో కేకేఆర్ భారీ స్కోరు సాధించలేకపోయింది.
55
గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం
181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ నిలకడగా ఆడి విజయాన్ని అందుకుంది. కేకేఆర్ బౌలర్లు కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ, గుజరాత్ బ్యాటర్లు కీలక సమయాల్లో బౌండరీలు బాదుతూ మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నారు. చివరి ఓవర్ వరకు సాగిన ఈ పోరులో గుజరాత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రబాడా అద్భుత బౌలింగ్‌తో కేకేఆర్ నడ్డి విరవగా, బ్యాటింగ్‌లోనూ గుజరాత్ తన బలాన్ని చూపించింది.