నేటి నుంచి హైదరాబాద్‌ వీధుల్లో ఫార్ములా-ఈ రేసు... బాద్‌షా సినిమా రీ-రిలీజ్‌కి బ్రేకులు...

First Published | Nov 16, 2022, 9:42 AM IST

టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఖుషీ, ఒక్కడు, చెన్నకేశవరెడ్డి... ఇలా పాత బ్లాక్‌బస్టర్ సినిమాలన్నీ ఒక్కొక్కటిగా మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ విషయంలో షాక్ తగిలింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘బాద్‌షా’  రీ-రీలీజ్ ఈవెంట్‌కి ఫార్ములా-ఈ కారు రేసు బ్రేకులు వేసింది.. 

Image credit: Facebook

హైదరాబాద్‌లో జరుగుతున్న  ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేసు ఈవెంట్ కారణంగా ప్రసాద్ మల్టీప్లెక్స్‌‌ కొన్ని రోజుల పాటు మూతపడనుంది. హుస్సేన్ సాగన్‌, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ఏరియాల్లో నవంబర్ 16 నుంచి 21 వరకూ ఈ రేసు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఈ రేసు కోసం ట్యాంక్ బండ్‌ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించింది హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్...

ఫార్ములా 1 కారు రేసుకి ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన క్రేజ్ ఉంది. అయిత మరి ఫార్ములా-ఈ ఏంటి? ఈ రేసులో వాడే కార్లన్నీ కూడా ఎలక్ట్రిక్‌ కార్లే. ఈ ఫార్ములా-ఈ రేసింగ్‌ని ఇప్పటికే 12 దేశాల్లో నిర్వహించారు. గంటకు 280 కి.మీ.ల వేగంతో దూసుకుపోయే రేసింగ్ కార్లు, ఈ రేసులో పాల్గొనబోతున్నాయి...

Latest Videos


నవంబర్ 16 నుంచి 21 వరకూ ఫార్ములా-ఈ కార్ల రేసింగ్ జరుగుతుండగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ జరగనుంది. దీని కోసం 2.37 కిలో మీటర్ల ట్రాక్‌ని సిద్ధం చేస్తోంది ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ (ఎఫ్‌ఐఏ)... ఇందుకోసం ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న చెట్లను తీసి, ఎన్టీఆర్ గార్డెన్‌, సంజీవయ్య పార్కుల్లో రీలోకేట్ చేశారు...

ఈ రేసులో భారత ఆటోమొబైల్ కంపెనీ దిగ్గజ కంపెనీలు మహేంద్ర, టాటా సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. టాటా సంస్థ నంచి జాగ్వార్, మహేంద్ర సంస్థ నుంచి సర్క్యూట్ సిరీస్‌ కార్లు ఈ రేసులో పాల్గొంటాయి. టాటా జాగ్వార్, మెర్సెండేజ్, నిస్సాన్, మహేంద్ర సంస్థల ఫార్ములా-ఈ కార్లు ఈ రేసులో బరిలో దిగుతున్నాయి...

2014లోనే ఫార్ములా-E వరల్డ్ ఛాంపియన్‌షిప్ మొదలైంది. 2020లో ఎఫ్‌ఐఏకి వరల్డ్ ఛాంపియన్‌షిప్ హోదా దక్కింది. టోక్యో, లండన్ వంటి మహా నగరాల్లో జరిగిన  ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్... ఇప్పుడు హైదరాబాద్ వేదికగా జరగనుంది..

నవంబర్ 19న ‘బాద్‌షా’ సినిమాని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో రీరిలీజ్ చేస్తున్నామని నిర్మాత బండ్ల గణేశ్ ప్రకటించాడు. అయితే ఆ రోజు ఈ ఫార్ములా-E కారు రేసు కారణంగా మల్టీప్లెక్స్ మూసి ఉంటుందని ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం ప్రకటించింది. 

click me!