Virat Kohli : సచిన్, పాంటింగ్ లకు షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. సూపర్ రికార్డు !

Published : Jan 06, 2026, 09:22 PM ISTUpdated : Jan 06, 2026, 09:24 PM IST

Virat Kohli 25000 Runs Record: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 25,000 పరుగులు పూర్తి చేసిన టాప్ 5 బ్యాటర్ల జాబితాలో కోహ్లీ ఎంట్రీ ఇచ్చారు. పలువురు లెజెండరీ ప్లేయర్లతో పాటు సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచారు.

PREV
16
25 వేల పరుగుల వీరులు: కోహ్లీనే కింగ్.. టాప్-5 లిస్ట్ ఇదే !

అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొత్త ఆటగాళ్లు వచ్చి పాత రికార్డులను తిరగరాయడం సహజం. ప్రపంచ క్రికెట్‌లో లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

అయితే, పరుగుల వేటలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా శరవేగంగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 28 వేల పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో కేవలం 6 మంది బ్యాటర్లు మాత్రమే 25,000 కంటే ఎక్కువ పరుగులను సాధించారు. వారిలో అత్యంత వేగంగా ఈ 25 వేల పరుగుల మార్కును అందుకున్న టాప్-5 బ్యాటర్ల వివరాలను గమనిస్తే..

26
1. విరాట్ కోహ్లీ

ప్రపంచ క్రికెట్‌లో 25,000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అందరికంటే ముందున్నారు. ఈ ఘనతను సాధించిన అత్యంత వేగవంతమైన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించారు. విరాట్ కేవలం 549 ఇన్నింగ్స్‌లలోనే ఈ మ్యాజికల్ మార్కును దాటేశారు. ఇది క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.

కోహ్లీ ఇప్పుడు కేవలం వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. కోహ్లీ కెరీర్ గణాంకాలను చూస్తే, అతని పేరిట 556 మ్యాచ్‌లలో మొత్తం 27,975 పరుగులు ఉన్నాయి. ఇందులో ఏకంగా 84 సెంచరీలు, 145 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే, తన సుదీర్ఘ కెరీర్‌లో కోహ్లీ 40 సార్లు డకౌట్ కావడం కూడా గమనార్హం.

36
2. సచిన్ టెండూల్కర్

క్రికెట్ దేవుడిగా అభిమానులు పిలుచుకునే సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. సచిన్ 25,000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి చేసిన ప్రయాణం అతని గొప్పతనాన్ని సూచిస్తుంది. రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్ ఆశలను తన భుజాలపై మోసిన సచిన్.. ప్రతి ఫార్మాట్‌లోనూ, ప్రతి పరిస్థితిలోనూ అద్భుతంగా రాణించారు.

సచిన్ టెండూల్కర్ 577 ఇన్నింగ్స్‌లలో తన 25 వేల అంతర్జాతీయ పరుగులను పూర్తి చేసుకున్నారు. ఓవరాల్‌గా తన కెరీర్‌లో 664 మ్యాచ్‌లు ఆడిన సచిన్, మొత్తం 34,357 పరుగులు సాధించారు. ఇందులో 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. క్రికెట్ చరిత్రలో వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా సచిన్ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది.

46
3. రికీ పాంటింగ్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అత్యంత వేగంగా 25,000 పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా నిలిచారు. పాంటింగ్ ఈ ఘనతను 588 ఇన్నింగ్స్‌లలో సాధించారు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన పాంటింగ్, తన నాయకత్వంలో 2003, 2007లో ఆ జట్టుకు వరల్డ్ కప్ అందించారు.

వన్డేలతో పాటు టెస్టుల్లోనూ పాంటింగ్ రికార్డులు చాలా అద్భుతంగా ఉంటాయి. పాంటింగ్ తన కెరీర్‌లో 560 మ్యాచ్‌లలోని 668 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి మొత్తం 27,483 పరుగులు సాధించారు. ఈ డాషింగ్ బ్యాటర్ ఖాతాలో 71 సెంచరీలు, 146 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

56
4. జాక్ కలిస్

దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్ రౌండర్ జాక్ కలిస్ నమ్మకానికి మారుపేరుగా నిలిచారు. క్రీజులో శాంతంగా, ఎంతో నియంత్రణతో బ్యాటింగ్ చేయడం కలిస్ ప్రత్యేకత. ఈ క్రమంలోనే అతను 25,000 పరుగుల మార్కును చేరుకుని, అన్ని ఫార్మాట్లలోనూ సంవత్సరాల తరబడి నిలకడగా రాణించారు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మ్యాచ్‌ను కాపాడాలన్నా, లేదా విజయతీరాలకు చేర్చాలన్నా కలిస్ ఎప్పుడూ ముందుండేవారు.

అతని టెక్నిక్, ఆల్ రౌండర్ సామర్థ్యం అతన్ని క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరిగా నిలబెట్టింది. జాక్ కలిస్ 519 మ్యాచ్‌లలోని 617 ఇన్నింగ్స్‌లలో మొత్తం 25,534 పరుగులు చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ స్టార్ ప్లేయర్ 61 సెంచరీలు, 149 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఈ రికార్డును చేరుకోవడానికి కలిస్ 594 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు.

66
5. కుమార్ సంగక్కర

శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర తన క్లాస్ బ్యాటింగ్, క్రమశిక్షణతో 25,000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఈ ఘనత సాధించడానికి సంగక్కర 608 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. శ్రీలంక క్రికెట్‌కు అన్ని ఫార్మాట్లలోనూ అతను ఒక బలమైన స్తంభంలా నిలిచారు.

సంగక్కర బ్యాటింగ్‌లో చూపించే నిలకడ, అతని నాయకత్వ లక్షణాలు, ఒత్తిడిలోనూ రాణించే సామర్థ్యం అతన్ని ఇతర ఆటగాళ్ల కంటే భిన్నంగా నిలబెట్టాయి. తన కెరీర్‌లో 594 మ్యాచ్‌లు ఆడిన సంగక్కర, 666 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 28,016 పరుగులు సాధించారు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన సంగక్కర పేరిట 63 సెంచరీలు, 153 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories