ఛాంపియన్స్ ట్రోఫీలో దారుణ ప్రదర్శన నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సారథిగా తప్పుకొంటానని జాస్ బట్లర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి తర్వాత ఎవరు పగ్గాలు అందుకుంటారనే విషయంలో అప్పడే సస్పెన్స్ మొదలైంది. ఇంగ్లాండ్ క్రికెట్ సెలెక్టర్లు మే-జూన్‌లో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేస్తారు. మరి పలు ఊహాగానాల నేపథ్యంలో ఎవరు రేసులో ముందున్నారో చూద్దాం.
2022లో t20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ సారథి జాస్ బట్లర్. తర్వాత ఎన్నో విజయాలు అందించిన జట్టుకు నాయకుడుగా ఉన్నాడు. కానీ తర్వాత అతడి నాయకత్వంలో జట్టు ఎన్నో ఓటములు చవిచూసింది. తాజాగా జాస్ అతడి జట్టు వైట్-బాల్ కెప్టెన్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయాడు. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌తో వరుస ఓటముల తర్వాత కెప్టెన్‌గా తప్పుకున్నాడు.
బట్లర్ నాయకత్వంలో ఇంగ్లాండ్ 2023లో వన్డే ప్రపంచ కప్, 2024లో టీ20 ప్రపంచ కప్ గెలవలేకపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు, బట్లర్ జట్టు ఇండియా చేతిలో సిరీస్ ఓడిపోయింది. బట్లర్ వైట్-బాల్ కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో, ఇంగ్లాండ్ క్రికెట్ సెలెక్టర్లు మే-జూన్‌లో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు కొత్త కెప్టెన్‌ను నియమిస్తారు. దానికి నలుగురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు.
25
చిత్ర సౌజన్యం: గెట్టి ఇమేజెస్
1. హ్యారీ బ్రూక్
హ్యారీ బ్రూక్‌ను ఇండియా సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి వైస్-కెప్టెన్‌గా నియమించారు. బ్రూక్ భవిష్యత్తులో కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. బ్రూక్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో 312 పరుగులు చేశాడు. తను అటాకింగ్ ప్లేయర్.
35
చిత్ర సౌజన్యం: గెట్టి ఇమేజెస్
2. ఫిల్ సాల్ట్
ఫిల్ సాల్ట్ వైట్-బాల్ క్రికెట్‌కు కెప్టెన్ అయ్యే అవకాశం లేకపోలేదు. సాల్ట్ 'ది హండ్రెడ్'లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. గత వేసవిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో జట్టును ముందుండి నడిపించాడు.
45
చిత్ర సౌజన్యం: గెట్టి ఇమేజెస్
3. జో రూట్
జో రూట్ నమ్మదగిన బ్యాట్స్మన్. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. టీ20 ప్రపంచ కప్ 2026, వన్డే ప్రపంచ కప్ 2027 ను ద్రుష్టిలో పెట్టుకుంటే జో రూట్ మంచి ఎంపిక అవుతుంది. రూట్ 2017 నుండి 2022 వరకు 64 టెస్టులకు కెప్టెన్‌గా ఉన్నాడు.
55
చిత్ర సౌజన్యం: గెట్టి ఇమేజెస్
4. బెన్ డకెట్
ఇంగ్లాండ్ వైట్-బాల్ కెప్టెన్‌గా బెన్ డకెట్ కూడా రేసులో ఉన్నాడు. గత కొన్నేళ్లుగా డకెట్ అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడు. మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. 2023లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు బట్లర్ డిప్యూటీగా ఉన్నాడు.