హార్దిక్ పాండ్యా లేకుండానే కొడుకు అగస్త్య పుట్టిన రోజు వేడుక‌లు.. నటాషా ఫొటోలు వైర‌ల్

First Published | Aug 2, 2024, 1:55 PM IST

Hardik Pandya : భార‌త స్టార్ క్రికెట‌ర్ హార్దిక్ పాండ్యాతో విడాకులు త‌ర్వాత మొదటిసారిగా తన కొడుకు పుట్టినరోజును జరుపుకుంది న‌టాషా స్టాంకోవిచ్. ఈ ఫోటోల‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 
 

Hardik Pandya - Natasa Stankovic : సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిచ్ విడాకుల తర్వాత తన మాజీ భర్త హార్దిక్ పాండ్యా లేకుండా తన కొడుకు పుట్టినరోజును జరుపుకోవడం ఇదే మొదటిసారి. నటాషా తన కొడుకు పుట్టినరోజు వేడుక ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

 సెర్బియా నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్-టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇద్దరు గ‌తంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల విడాకుల అంశంతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత హార్దికా పాండ్యాతో నటి న‌టాషా కూడా పెద్ద‌గా కనిపించలేదు. గ‌త నెల‌లో తామిద్ద‌రం విడాకులు తీసుకుంటున్నట్టు ప్ర‌క‌టించారు.


వీరిద్ద‌రికీ ఇప్ప‌టికే ఒక కుమారుడు ఉన్నాడు. అత‌ని పేరు అగస్త్య. నటాషా ప్రస్తుతం తన కుమారుడు అగస్త్యతో కలిసి తన స్వస్థలమైన సెర్బియాలో ఉంది. ఈ క్ర‌మంలోనే అగస్త్య  నాల్గో పుట్టిన రోజును చాలా ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఈ గ్రాండ్ వేడుక‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేశాడు.

తన కొడుకు అగస్త్య పుట్టిన తర్వాత, ప్రతి సంవత్సరం హార్దిక్ పాండ్యాతో కలిసి జరుపుకునే నటాషా మొదటిసారిగా హార్దిక్ పాండ్యా లేకుండా తన కొడుకు నాలుగేళ్ల పుట్టినరోజును జరుపుకుంది. హార్దిక్ పాండ్యకు కొడుకు అగస్త్య అంటే పంచప్రాణం. తన ముద్దుల కొడుకు పుట్టినరోజు సందర్భంగా కౌగిలించుకుని శుభాకాంక్షలు చెప్పలేని బాధ‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. 

నటాషా-హార్దిక్ విడాకుల తర్వాత, నటాషా తన బిడ్డను తానే పెంచుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే అత‌న్ని త‌న‌తో పాటు సెర్బియాకు తీసుకెళ్లింది. కొడుకు అగస్త్య పుట్టినరోజు పార్టీలో తెల్లటి హాట్ వీల్స్ షర్ట్ ధరించాడు. బొమ్మ కారులో ఫోటోకు పోజులివ్వడం క‌నిపించింది. 

కొన్ని బెలూన్లు, ఎమోజీలతో పాటు హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి నటాషా తన కొడుకు పుట్టినరోజు చిత్రాలను పంచుకుంది. 'అగస్త్యుడు నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు..' అని రాశాడు. హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా నటాషా పోస్ట్‌కు కామెంట్ హార్ట్ సింబల్‌ను పంపారు. అలాగే నేహా ధూపియా కూడా 'హ్యాపీ బర్త్ డే, గాడ్ బ్లెస్' అంటూ హార్ట్ ఎమోజీతో పాటు కామెంట్ చేసింది.

Latest Videos

click me!