సిన్సినాటి ఓపెన్ ఫైనల్ లో చొక్కా చించుకుని జకోవిచ్ విజయగర్జన.. కన్నీటి పర్యంతమైన అల్కరాజ్...

First Published | Aug 22, 2023, 10:02 AM IST

సిన్సినాటి ఓపెన్ ఫైనల్ లో వరల్డ్ నెం. 2 జకోవిచ్ విజయాన్ని సాధించారు. దీంతో వింబుల్డన్ లో ఓడిపోయిన ప్రతీకారం తీర్చుకున్న సంతోషంలో చొక్కా చించుకుని సంబురాలు చేసుకున్నాడు. 

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విజయం సొంతమైతే ఒక్కొక్కరు ఒకోలా స్పందిస్తుంటారు. ఆ విజయం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానం అయితే.. ప్రత్యర్థి అత్యంత బలమైన వ్యక్తి అయితే దాన్ని వ్యక్తం చేసే మార్గాలు ఒక్కోసారి చర్చనీయాంశంగా మారుతుంటాయి. అలాంటి సంబరాలే చేసుకున్నాడు టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్. 

సిన్సినాటి ఓపెన్ ఫైనల్ లో వరల్డ్ నెంబర్వన్ కార్లోస్ అల్కరాజును  వరల్డ్ నెంబర్ టు ప్లేయర్ గా ఉన్న జకోవిచ్ ఓడించాడు. దీంతో ప్రతీకారం తీర్చుకున్నా అన్న సంతోషంలో సింహ గర్జన చేస్తూ, చొక్కా చింపుకుని మరి సంబరాలు చేసుకున్నాడు జకోవిచ్.  


వింబుల్డన్ - 2023 ఫైనల్ లో 35 రోజుల కిందట అల్కరాజ్ చేతిలో ఎదురైన పరాభవాన్ని గుర్తు చేసుకుంటూ.. విజయానందంతో ఊగిపోతూ.. సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. పోటా పోటీగా సాగిన ఈ మ్యాచ్ మూడు గంటల 49 నిమిషాల పాటు రసవత్తరంగా సాగింది. 

నోవాక్ జకోవిచ్, కార్లోస్ అల్కరాజ్ ల మధ్య జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో  జకోవిచ్  5-7, 7-6(7), 7-6 (4) తేడాతో అల్కరాజ్ ను ఓడించాడు. అలా తన ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్స్ సంఖ్యను 39కి పెంచుకున్నాడు. ఏటీపీ టూర్ చరిత్రలోనే ఈ మ్యాచ్ అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్ గా రికార్డు నమోదు చేసుకుంది.

2010లో రోజర్ ఫెదరర్ - మార్టీ ఫిష్ మధ్య రెండు గంటల 49 నిమిషాల పాటు మ్యాచ్ జరిగింది. అప్పట్లో ఇదే రికార్డు సమయం. ఇప్పుడు జరిగిన ఈ మ్యాచ్ ముందు వరకు ఏటీపీ టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్  ఇదే. ఇప్పుడు దీని రికార్డును జకోవిచ్, అల్కరాజ్ ల మ్యాచ్ బద్దలు కొట్టింది.

ఓవైపు కార్లోస్ అల్కరాజ్,  మరోవైపు నోవాక్ జకోవిచ్.. జకోవిచ్ మదిలో  వింబుల్డన్ ఓడిన ప్రతీకారం… ఇవన్నీ కలిసి పోరు మొత్తం కొదమ సింహాలు తలపడ్డట్టుగా సాగింది. వీరి పోరు అభిమానులకు  అసలుసిసలైన టెన్నిస్ మజా ఎలా ఉంటుందో పరిచయం చేసింది.  

ఛాంపియన్షిప్ పాయింట్ వరకు వచ్చిన జకోవిచ్ ఓ దశలో వెనకబడిపోయాడు. అయితేనేం, ఎట్టకేలకు విజయం సాధించాడు.  దీంట్లో ఓడిపోవడంతో నొవాక్ అల్కరాజ్ కన్నీటి పర్యంతమయ్యాడు.  ఇది చూసిన అందర్నీ కలిసి వేసింది. అదే సమయంలో ప్రత్యర్థిపై  అపూర్వ విజయం సాధించడంతో జకోవిచ్ సింహ గర్జన చేశాడు.  విజయగర్వంతో ఊగిపోయాడు. 

Latest Videos

click me!