‘ది రాక్’ డ్వేన్ జాన్సన్‌ను దాటేసిన క్రిస్టియానో రొనాల్డో... 300 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో...

First Published Jul 2, 2021, 1:07 PM IST

సాకర్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డోకి ఉన్న క్రేజ్, ఫాలయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్, తాజాగా మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఒకే ఏడాదిలో అత్యధిక ఫాలోవర్లు తెచ్చుకున్న సెలబ్రిటీగా నిలిచాడు...

పోర్చుగల్ టీమ్‌కి కెప్టెన‌గా వ్యవహరిస్తున్న క్రిస్టియానో రొనాల్డో, యూఈఎఫ్‌ఏ యూరో 2020 టోర్నీలో తన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో ఓడిన పోర్చుగల్‌, యూరో 2020 టోర్నీ నుంచి ఇప్పటికే నిష్కమించింది...
undefined
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న సెలబ్రిటీల్లో ఒకడైన రొనాల్డో, ఒక్కో ప్రమోషన్ పోస్టుకి 1.6 మిలియన్ డాలర్ల దాకా (దాదాపు 12 కోట్ల రూపాయలు) వసూలు చేస్తున్నాడు..
undefined
తాజాగా 36 ఏళ్ల ఫుట్‌బాల్ ప్లేయర్, మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, హాలీవుడ్ బిజీయెస్ట్ యాక్టర్ డ్వేన్ ‘ది రాక్’ జాన్సన్‌ను దాటేసి, టాప్ స్పాట్‌కి ఎగబాకాడు..
undefined
2017 తర్వాత అమెరికా సెలబ్రిటీ, మ్యూజిక్ స్టార్స్ కాకుండా ఇతర ప్రాంతానికి చెందిన సెలబ్రిటీ, ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్యలో టాప్‌‌లో ఉండడం ఇదే తొలిసారి.
undefined
2019 దాకా పోస్టుకి 0.9 మిలియన్ డాలర్ల దాకా తీసుకునే క్రిస్టియానో రొనాల్డో, డ్వేన్ ‘ది రాక్’ జాన్సన్, కీలే జెన్నర్ తర్వాతి స్థానంలో ఉండేవాడు. అయితే గత ఆరు నెలల్లో అతని ఫాలోవర్ల సంఖ్య రెట్టింపు వేగంతో పెరగడంతో రేటు కూడా భారీగా పెంచేశాడు రొనాల్డో...
undefined
2017 ఆరంభంలో 100 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న క్రిస్టియానో రొనాల్డో, ఈ ఏడాది ప్రారంభంలో 175 మిలియన్లతో ఉన్నాడు. అయితే ప్రస్తుతం అతనికి 300 మిలియన్లకి పైగా ఫాలోవర్లు ఉన్నారు... ఈ ఆరు నెలల్లోనే 125 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నాడు రొనాల్డో...
undefined
ఓ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో రొనాల్డో, కోక్ బాటిళ్లను పక్కనబెట్టడం వలన కోకాకోలా కంపెనీకి వేల కోట్ల నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత రొనాల్డో క్రేజ్ మరింత పెరిగింది.
undefined
ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లను కూడా కలుపుకుంటే రొనాల్డో... మొత్తం ఫాలోవర్ల సంఖ్య 550 మిలియన్ల దాకా ఉంటుంది...
undefined
ప్రస్తుతం 250 మిలియన్ల ఇన్‌స్టా ఫాలోవర్లను కలిగి ఉన్న డ్వేన్ జాన్సన్, ప్రతీ పోస్టుకి 1.52 మిలియన్ డాలర్లు (దాదాపు 11.3 కోట్లకు పైగా) ఆదాయం పొందుతూ రెండో స్థానంలో ఉన్నాడు.
undefined
అమెరికన్ పాప్ ఆర్జిస్ట్ అరియానా గ్రాండే 1.51 మిలియన్ల డాలర్లతో మూడో స్థానంలో ఉంది. రొనాల్డో తర్వాత ఇన్‌స్టా ద్వారా అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న సెలబ్రిటీ టాప్ 10 లిస్టులో ఉన్న ఒకే ఒక్క ప్లేయర్ లియోనెల్ మెస్సీ...
undefined
అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన మెస్సీ, ప్రస్తుతం 224 మిలియన్ల ఫాలోవర్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. మెస్సీ చేసే ప్రతీ పోస్టుకి 1.1 మిలియన్ డాలర్లు (8.2 కోట్ల రూపాయలకు పైగా) చెల్లిస్తోంది ఇన్‌స్టాగ్రామ్..
undefined
click me!