IND vs PAK : భారత్‌తో మ్యాచ్ అంటేనే భయం.. అందుకే పాకిస్థాన్ వేసింది బాయ్‌కాట్ వేషం ! కానీ ఐసీసీ వేసే వేటుకు పాక్ క్రికెట్ బోర్డు విలవిలలాడాల్సిందే! పాక్ ఎందుకు ఆడనంటోంది? అసలు ఏం జరిగింది? పాక్ కలిగే నష్టాలు ఏంటి?
IND vs PAK : భారత్‌తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు మరి
క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద యుద్ధానికి రంగం సిద్ధమైంది అనుకుంటే.. సీన్ మొత్తం రివర్స్ అయింది. దాయాదుల పోరు కోసం ప్రపంచమంతా వెయ్యి కళ్లతో చూస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం తోక ముడిచింది. అవును.. మీరు విన్నది నిజం! టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియాతో ఢీకొట్టేది లేదని పాక్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది!" భారత్‌తో మ్యాచ్ అంటేనే భయం.. అందుకే పాకిస్థాన్ వేసింది బాయ్‌కాట్ వేషం !
అసలు ఆట ఇక్కడే మొదలైంది. భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే టీమిండియాకు వచ్చే నష్టం ఏమీ లేదు.. కానీ పాకిస్థాన్ పరిస్థితే ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఐసీసీ పంజా విసిరితే పాక్ క్రికెట్ చరిత్ర పుటల్లో కలిసిపోవాల్సిందేనా? అస్సలు పాకిస్థాన్‌కు కలిగే ఆ ఐదు కోలుకోలేని దెబ్బలేంటి? ఐసీసీ తీసుకోబోయే ఆ బ్రహ్మాస్త్రం లాంటి నిర్ణయం ఏంటి?
26
1. భారత్‌కు లాభం.. పాకిస్తాన్ కు షాక్
పాకిస్తాన్ ఆడకపోయినా భారత్ కు వచ్చే నష్టం ఏం లేదు.. ఐసీసీ రూల్స్ ప్రకారం భారత్‌కు నేరుగా వాకోవర్ ఇచ్చేస్తారు. అంటే.. ఒక్క బంతి కూడా వేయకుండా, ఒక్క రన్ కూడా కొట్టకుండా టీమిండియా ఖాతాలోకి 2 పాయింట్లు వచ్చేస్తాయి. ఇక పాకిస్థాన్ టోర్నీలో తర్వాతి స్టేజ్ కు వెళ్లాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించాలి. గెలవకపోతే ఇంటికి పోవడం ఖాయం.
36
2. ఐసీసీ నుంచి పాకిస్తాన్ కు నిధులు కట్
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదాయంలో ఎక్కువ భాగం ఐసీసీ ఇచ్చే గ్రాంట్ల ద్వారానే వస్తుంది. భారత్-పాక్ మ్యాచ్ రద్దు వల్ల ఐసీసీకి, బ్రాడ్‌కాస్టర్లకు వేల కోట్ల నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి, ఐసీసీ పాకిస్థాన్‌కు ఇచ్చే వార్షిక ఆదాయ వాటా లో భారీగా కోత విధిస్తుంది. ఇది పాక్ దేశవాళీ క్రికెట్‌ను సంక్షోభంలోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్‌కు ఇది కోలుకోలేని దెబ్బ.
3. అంతర్జాతీయ క్రికెట్ నుండి పాకిస్తాన్ ను గెంటేసే ఛాన్స్
ప్రభుత్వ జోక్యం కారణంగా క్రికెట్ మ్యాచ్‌లను బహిష్కరించడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. గతంలో శ్రీలంక, జింబాబ్వే బోర్డులపై ఇలాంటి కారణాలతోనే ఐసీసీ నిషేధం విధించింది. ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే బాటలో నడిస్తే, ఆ జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుండి తాత్కాలికంగా సస్పెండ్ చేసే అధికారం ఐసీసీకి ఉంది. అదే జరిగితే, ఇక పాక్ టీమ్ గల్లీ క్రికెట్ ఆడుకోవాల్సిందే.
56
4 : స్పాన్సర్ల వెనకడుగు.. బ్రాండ్ విలువ పతనం
క్రికెట్ ప్రపంచంలో భారత్-పాక్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మ్యాచ్ ద్వారానే పాకిస్థాన్ క్రికెట్‌కు గ్లోబల్ స్పాన్సర్లు దొరుకుతారు. ఒకవేళ పాక్ ఇలాంటి మెగా ఈవెంట్లలో మ్యాచ్‌లను బహిష్కరిస్తే, అంతర్జాతీయ కంపెనీలు పాక్ జట్టుకు స్పాన్సర్‌షిప్ ఇవ్వడానికి వెనకాడుతాయి. జెర్సీ మీద లోగో వేసే దిక్కు కూడా ఉండదు. దీనివల్ల పాక్ క్రికెటర్ల ఆదాయం కూడా భారీగా తగ్గుతుంది. మొత్తానికి ఒక్క నిర్ణయంతో పాకిస్థాన్ క్రికెట్ శకం ముగిసిపోయే ప్రమాదం కనిపిస్తోంది!
66
5 : టోర్నీపై ప్రభావం.. ఐసీసీ ఆగ్రహం
ఈ ఒక్క నిర్ణయం వల్ల ఐసీసీ టోర్నీ ప్రతిష్ఠ మసకబారుతుంది. ప్రసార హక్కులు కలిగిన సంస్థలు ఐసీసీపై ఒత్తిడి తెస్తాయి. భవిష్యత్తులో పాకిస్థాన్‌కు ఎటువంటి మేజర్ టోర్నీల ఆతిథ్య హక్కులు దక్కకుండా ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్న తరుణంలో, పాకిస్థాన్ తన గొయ్యి తానే తవ్వుకుంది అనే పరిస్థితిలోకి చేరింది.