ఊర కుక్కలతో ప్రాక్టీస్ చేసి కామన్వెల్త్ మెడల్ గెలిచాడు... లిస్టులో కూడా లేని తేజస్విన్ శంకర్...

First Published | Aug 4, 2022, 1:37 PM IST

కామన్వెల్త్ గేమ్స్ 2022 ద్వారా ఎందరో యువ అథ్లెట్ల విజయగాథలు ప్రపంచానికి పరిచయం అవుతున్నాయి. బర్మింగ్‌హమ్‌లో జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల హై జంప్ ఈవెంట్‌లో 2.22 మీటర్లు దూకిన తేజస్విన్ యాదవ్, టీమిండియాకి మొట్టమొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ పతకాన్ని అందించాడు...

Tejaswin Shankar

భారతదేశానికి మొట్టమొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ పతకం అందించిన తేజస్విన్ శంకర్‌‌ను తొలుత అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కామన్వెల్త్‌ గేమ్స్‌కి పంపడానికి అంగీకరించలేదు...

యూఎస్ స్టేట్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్న తేజస్విన్ శంకర్, ఇండియాలో పాల్గొనలేదని వాదించారు. దీంతో ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించిన తేజస్విన్ శంకర్, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు...

Latest Videos


Tejaswin Shankar

అయితే యూఎస్‌లో పాల్గొన్నందుకు కాదు కానీ భారత అథ్లెట్ల కోటా ఎక్కువ ఉండడంతో తేజస్విన్ శంకర్‌ని పంపకూడదని అథ్లెటిక్స్ ఫెడరేషన్ భావించినట్టు కోర్టు విచారణలో తేలింది.. 

ఈ కారణంగా తేజస్విన్ శంకర్‌కి వీసా కూడా చాలా ఆలస్యంగా వచ్చింది. లేట్ సెలక్షన్ కారణంగా కేవలం మూడు రోజుల ముందే బర్మింగ్‌హమ్ చేరుకున్నాడు తేజస్విన్ శంకర్...

కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించేందుకు అందరికంటే భిన్నంగా ఆలోచించిన తేజస్విన్ శంకర్, జేఎల్‌ఎన్ గ్రౌండ్‌లో ఉండే మూడు కుక్కలకు బిస్కెట్లు వేసి మచ్చిక చేసుకున్నాడు. ఆ తర్వాత వాటితో కలిసి హై జంప్ చేయడం మొదలెట్టాడు...

Tejaswin Shankar

వీధి కుక్కలతో పోటీపడి హై జంప్ చేయడం ప్రాక్టీస్ చేసిన తేజస్విన్ శంకర్, ఎన్నో అవరోధాలు దాటుకుని కామన్వెల్త్ వేదికపై భారతదేశానికి మొట్టమొదటి పతకాన్ని అందించాడు...

click me!