ఐపీఎల్ అంటే క్రికెటర్లకు కాసులు కురిపించే వేదిక. ఎంతోమంది జీవితాలను మార్చేసిన వేదిక. పలు కారణాలతో ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెటర్లను ఐపీఎల్ జట్లు తీసుకోవడం లేదు. భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం, భద్రతా కారణాల దృష్ట్యా మన ఆటగాళ్లు సైతం పాకిస్థాన్ వెళ్లడం లేదు. అందులో భాగంగానే పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇస్తున్నా.. మెన్ ఇన్ బ్లూ తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతోంది. దీనిపై పాక్ మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్ తన అక్కసు వెళ్లగక్కాడు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ ఐపీఎల్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత ఆటగాళ్లు కేవలం ఐపీఎల్ లోనే ఆడటం, పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్ వేదికలపై ఆడటకపోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు. భారత్ దుబాయ్‌లో ఆడటంతో 'వేదిక ప్రయోజనం' పొందుతోందని అన్నాడు.
23
చిత్ర క్రెడిట్: గెట్టి ఇమేజెస్
ఐపీఎల్‌లో ఆడేందుకు తమ ఆటగాళ్లను పంపడం ఆపాలని ఇంజమామ్-ఉల్-హక్ అన్ని క్రికెట్ బోర్డులను కోరారు. "భారత క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాకుండా ఇతర ఫ్రాంచైజీ టీ20 లీగ్‌లు, ది హండ్రెడ్‌లో పాల్గొనడానికి బీసీసీఐ అనుమతించదు. ఐపీఎల్‌లో మాత్రం పాల్గొంటారు. ఆ దేశ క్రికెటర్లు ఇలా చేసినప్పడు ఇతర బోర్డులు కూడా అదే విధానం అనుసరించాలి’ కదా అన్నాడు.
33
చిత్ర క్రెడిట్: గెట్టి ఇమేజెస్
2008లో ముంబై ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ క్రికెటర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడకుండా నిషేధించారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దుబాయ్‌కు రావడంతో భారత్ 'వేదిక ప్రయోజనం' వివాదం విచిత్ర పరిస్థితికి దారితీసింది. అయితే పాకిస్తాన్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చినప్పుడు భారత్ ప్రత్యామ్నాయ వేదికలో ఆడటం ఇదే మొదటిసారి కాదు.