ఇది కదా విధ్వంసం అంటే.! ఐపీఎల్ వేలంలో మళ్లీ ఆసీస్ ప్లేయర్ల ఊచకోత.. కొడితే కుంభస్థలమే

Published : Dec 17, 2025, 06:00 PM IST

IPL Auction: ఐపీఎల్ 2026 మినీ వేలంలో రికార్డులు బద్దలయ్యాయి. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ రూ. 25.20 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. పలువురు అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్లు సైతం అనూహ్యంగా భారీ ధరలు పలికారు.

PREV
15
జాక్ పాట్ కొట్టారు..

ఐపీఎల్ 2026 మినీ వేలం ఉత్కంఠగా సాగింది. ఈ వేలంలో అనేక రికార్డులు బద్దలయ్యాయి. కొందరు అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్లు ఊహించని భారీ జాక్‌పాట్‌లను కొట్టగా, స్టార్లుగా పేరున్న కొందరు ఆటగాళ్లను మాత్రం ఫ్రాంచైజీలు అస్సలు పట్టించుకోలేదు. అందరూ ఊహించినట్లుగానే గ్రీన్ భారీ ధర పలికాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది.

25
విదేశీ ప్లేయర్ గా రికార్డు..

కామెరాన్ గ్రీన్ కోసం చెన్నై, కోల్‌కతా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డాయి. చివరికి చెన్నై తప్పుకోవడంతో రూ. 25.20 కోట్లకు గ్రీన్ కోల్‌కతాకు సొంతమయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్‌గా గ్రీన్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2024లో మిచెల్ స్టార్క్‌ను కేకేఆర్ రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డును గ్రీన్ తిరగరాశాడు.

35
అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్లకు భారీ ధర..

ఈ మినీ వేలంలో కొందరు అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్లు కూడా భారీ ధర పలకడం గమనార్హం. కనీస ధర రూ. 30 లక్షలతో వేలంలోకి వచ్చిన ప్రశాంత్ వీర్‌ను దక్కించుకోవడం కోసం లక్నో, ముంబై, చెన్నై, రాజస్థాన్ పోటీ పడ్డాయి. చివరికి ప్రశాంత్ వీర్‌ను రూ. 14.20 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. కార్తీక్ శర్మ కూడా అనూహ్య ధర పలికాడు. చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14.20 కోట్లకు కార్తీక్‌ను దక్కించుకుంది. మరొక అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ ఆకిబ్ ధర్‌ను రూ. 8.40 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

45
రూ. 7 కోట్లకు వెంకటేష్ అయ్యర్..

వెంకటేష్ అయ్యర్ కనీస ధర రూ. 2 కోట్లు కాగా, అతని కోసం కేకేఆర్, ఆర్‌సీబీ పోటీ పడి, చివరికి రూ. 7 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఇక కొన్ని సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆకట్టుకున్న శ్రీలంక పేసర్ మతీషా పతిరన కూడా ఈ వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. కేకేఆర్ రూ. 18 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది.

55
వీరికి నిరాశ..

ఈ మినీ వేలంలో కొందరు స్టార్ ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. బేస్ ధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, గస్ ఆక్టిన్సన్, జేమీ స్మిత్, జానీ బెయిర్‌స్టో అన్‌సోల్డ్ అయ్యారు.

Read more Photos on
click me!

Recommended Stories