Asian Games 2026: ఆసియా గేమ్స్ లో కబడ్డీలో తిరుగులేని భారత్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన పురుషులు, మహిళల జట్లు

Published : Sep 25, 2026, 04:29 PM IST

Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026 కబడ్డీలో భారత పురుషులు, మహిళల జట్లు సెమీఫైనల్స్‌లో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాయి. పసిడి పతకాలే లక్ష్యంగా తుది పోరుకు సిద్ధమయ్యాయి.

PREV
16
గోల్డ్ మెడల్స్ మనవే.. ఆసియా గేమ్స్‌లో ఇండియన్ కబడ్డీ టీమ్స్ ఊచకోత

ఆసియా క్రీడలు 2026లో భారత కబడ్డీ ఆటగాళ్లు ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దుమ్మురేపుతున్నారు. జపాన్‌లోని ఐచి-నాగోయా లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత పురుషుల, మహిళల జట్లు రెండూ అజేయంగా నిలిచి ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నాయి. సెమీఫైనల్స్‌లో తమ పవర్ ఏంటో చూపిస్తూ ప్రత్యర్థి జట్లను చిత్తు చేసి, మరో రెండు స్వర్ణ పతకాలను భారత్ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యాయి.

26
థాయ్‌లాండ్‌ను తొక్కిపడేసిన పురుషుల జట్టు

పురుషుల సెమీఫైనల్‌లో భారత జట్టు థాయ్‌లాండ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే మన రైడర్లు విరుచుకుపడగా, డిఫెండర్లు ప్రత్యర్థి ఆటగాళ్లకు పాయింట్లు దక్కకుండా కట్టడి చేశారు. రన్నింగ్ హ్యాండ్ టచ్‌లు, పవర్ ఫుల్ ట్యాకిిల్స్‌తో 66-28 తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసి ఘన విజయాన్ని అందుకున్నారు. గ్రూప్ దశలో జపాన్, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్, చైనీస్ తైపీలను ఓడించిన టీమిండియా, అదే ఊపును సెమీస్‌లోనూ కొనసాగించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

36
నేపాల్‌పై అమ్మాయిల అరాచకం

మరోవైపు మహిళల సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ నేపాల్‌పై 48-24 తేడాతో తిరుగులేని విజయం సాధించింది. ఆరంభం నుంచే పక్కా వ్యూహంతో బరిలోకి దిగిన భారత అమ్మాయిలు నేపాల్‌ను ఏ దశలోనూ కోలుకోనీయలేదు. రైడింగ్, డిఫెన్స్ రెండింటిలోనూ అదరగొట్టి ఆసియా క్రీడల్లో మరోసారి పసిడి పతకం వైపు అడుగులు వేశారు. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, ఇరాన్, జపాన్‌లపై నెగ్గి అజేయంగా నిలిచిన భారత మహిళల టీమ్, సెమీస్‌లోనూ అదే జోరు చూపించింది.

46
మన గేమ్.. మనమే కింగ్స్: కోచ్ నీతా తత్వే

భారత మహిళల కబడ్డీ టీమ్ కోచ్ నీతా తత్వే జట్ల ప్రదర్శనపై తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. "కబడ్డీ అనేది మన దేశంలో పుట్టిన సాంప్రదాయ ఆట. భారత్‌ను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు. మేం ప్రతి మ్యాచ్‌కు పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగాం. ఇరాన్‌పై 10 పాయింట్లకు పైగా తేడాతో గెలవడం చరిత్రలో ఇదే తొలిసారి. జట్టులోని పూజ, నికిత వంటి ప్లేయర్లు విపరీతమైన వేగం, బలం ప్రదర్శిస్తున్నారు. మా దగ్గర ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్లు, కోచ్‌లు ఉన్నారు" అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

56
గోల్డ్ ఫైట్.. టైమింగ్స్ ఇవే

ఈ అద్భుత విజయాలతో భారత పురుషులు, మహిళల జట్లకు కనీసం రజత పతకాలు ఖాయమయ్యాయి. అయితే భారత జట్ల లక్ష్యం మాత్రం స్వర్ణ పతకాలే. సెప్టెంబర్ 26న జరగనున్న ఫైనల్ పోరులో మహిళల జట్టు ఉదయం 9:30 గంటలకు, పురుషుల జట్టు మధ్యాహ్నం 2:30 గంటలకు పసిడి పతకాల కోసం పోటీపడనున్నాయి.

66
ఇతర క్రీడల్లోనూ భారత్ రచ్చ

కబడ్డీతో పాటు ఇతర క్రీడల్లోనూ భారత అథ్లెట్లు మంచి ప్రదర్శన ఇస్తున్నారు.

• హాకీ: పురుషుల హాకీ పూల్-ఎ మ్యాచ్‌లో భారత్ 8-2 తేడాతో కొరియాను చిత్తు చేసి సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. దిల్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగాడు.

• స్క్వాష్ & టేబుల్ టెన్నిస్: స్క్వాష్‌లో తన్వీ ఖన్నా, అనాహత్ సింగ్ క్వార్టర్స్‌కు చేరగా, టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో ఆకుల శ్రీజ - దియ చిటాలే జోడీ ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.

Read more Photos on
click me!

Recommended Stories