Abhishek Sharma Vs Chris Gayle : అసలైన బాస్ ఎవరో తేలిపోయింది.. 36 మ్యాచ్‌ల్లోనే షాకింగ్ రికార్డ్

Published : Jan 26, 2026, 08:30 PM IST

Sharma Vs Chris Gayle : న్యూజిలాండ్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం తర్వాత అభిమానులు క్రిస్ గేల్‌తో పోలుస్తున్నారు. అయితే, 36 టీ20 మ్యాచ్‌ల తర్వాత వీరిద్దరిలో ఎవరి రికార్డు గొప్పదో, గణాంకాలు ఏం చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
అభిషేక్ శర్మ vs క్రిస్ గేల్: 36 మ్యాచ్‌ల్లో ఎవరి రికార్డు బెస్ట్?

టీమిండియా యువ సంచలనం, డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం తన బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో సునామీ సృష్టిస్తున్నాడు. క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటం ఇతని నైజం. ముఖ్యంగా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ, అతను చాలా అరుదుగా విఫలమయ్యాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి జట్లను భయపెడుతున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడిన తీరు చూసి, అభిమానులు అతన్ని ఏకంగా వెస్టిండీస్ దిగ్గజం, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్‌తో పోల్చడం మొదలుపెట్టారు.

26
అభిషేక్ శర్మ vs క్రిస్ గేల్: రికార్డుల లెక్క తేలిపోయింది!

ఆదివారం (జనవరి 25న) గువహటిలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. దీంతో టీ20ల్లో భారత్ తరపున యువరాజ్ సింగ్ తర్వాత అత్యంత వేగంగా ఫిఫ్టీ కొట్టిన రెండో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 20 బంతుల్లోనే 68 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ ప్రస్తుతం ఆడుతున్న తీరును చూసి క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు నెక్ట్స్ యూనివర్స్ బాస్ అంటూ అభివర్ణిస్తున్నారు.

36
36 మ్యాచ్‌ల్లో క్రిస్ గేల్ రికార్డు ఎలా ఉంది?

యూనివర్స్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ 2006లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్‌పై ఆడిన తన తొలి మ్యాచ్‌లో గేల్ 10 పరుగులు మాత్రమే చేశాడు. తన కెరీర్ ప్రారంభంలో మొదటి 36 టీ20 మ్యాచ్‌లు పూర్తయ్యే సమయానికి గేల్ గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి..

• మ్యాచ్‌లు: 36

• పరుగులు: 1060

• సగటు: 33.21

• స్ట్రైక్ రేట్: 141.15

• సెంచరీలు: 1

46
36 మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ రికార్డులు ఎలా ఉన్నాయి?

మరోవైపు భారత యువ కెరటం అభిషేక్ శర్మ 2024లో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తన తొలి మ్యాచ్‌లో అభిషేక్ పరుగులేమీ చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. కానీ ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటివరకు ఆడిన 36 మ్యాచ్‌ల్లో అభిషేక్ నమోదు చేసిన గణాంకాలు గమనిస్తే..

• మ్యాచ్‌లు: 36

• పరుగులు: 1267

• సగటు: 38.39

• స్ట్రైక్ రేట్: 195.22

• సెంచరీలు: 2

56
ఎవరు బెస్ట్? గణాంకాలు ఏం చెబుతున్నాయి?

మొదటి 36 మ్యాచ్‌ల గణాంకాలను పరిగణనలోకి తీసుకుని పోల్చి చూస్తే, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ కంటే భారత ఆటగాడు అభిషేక్ శర్మ స్పష్టంగా ముందంజలో ఉన్నాడు. పరుగుల పరంగానే కాకుండా, సగటు, స్ట్రైక్ రేట్ విషయంలో కూడా అభిషేక్ రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా గేల్ 141 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తే, అభిషేక్ ఏకంగా 195కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం గమనార్హం. అలాగే సెంచరీల విషయంలోనూ గేల్ (1) కంటే అభిషేక్ (2) ముందున్నాడు.

66
ఫార్మాట్ల వ్యత్యాసం ఎలా ఉంది?

గణాంకాల పరంగా అభిషేక్ శర్మ ప్రస్తుతం గేల్ కంటే మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ, ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. క్రిస్ గేల్ కేవలం టీ20 మాత్రమే కాకుండా టెస్టులు, వన్డేల్లోనూ అద్భుతమైన రికార్డులను కలిగి ఉన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ గేల్ తనదైన ముద్ర వేశాడు. మరోవైపు అభిషేక్ శర్మ ప్రస్తుతం ఒక ఫార్మాట్‌లో (టీ20) మాత్రమే ఆడుతున్నాడు. అయితే టీ20ల్లో మాత్రం ఆరంభంలోనే గేల్ రికార్డులను అధిగమించడం ద్వారా, అభిషేక్ భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు సృష్టిస్తాడని నిస్సందేహంగా చెప్పవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories