మ్యాక్స్‌వెల్, త్రిపాఠి, కాన్వే, స్టోయినిస్.. చెన్నై, పంజాబ్ రిలీజ్ ఆటగాళ్లు వీరే.! లిస్టు పెద్దదే మావ

Published : Nov 05, 2025, 07:28 PM IST

Chennai Super Kings: ఐపీఎల్ 2026 ఆక్షన్‌కు ముందుగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఏ ఆటగాళ్లను విడుదల చేయబోతున్నాయో ఓసారి లుక్కేయండి. గ్లెన్ మ్యాక్స్‌వెల్, రాహుల్ త్రిపాఠి వంటి కీలక ఆటగాళ్లు వారి జట్ల నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

PREV
15
మినీ ఆక్షన్ డేట్స్ ఇవి..

ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ డిసెంబర్ 13 నుంచి 15 మధ్య జరగనుంది. ఈ క్రమంలో ఐపీఎల్‌లోని జట్లన్నీ ఏయే ఆటగాళ్లను విడుదల చేయాలా.? అనే ప్రణాళికలను రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఏయే ఆటగాళ్లను విడుదల చేయబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

25
పంజాబ్ లిస్టు ఇదిగో

గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, లాకీ ఫెర్గుసన్, మార్కస్ స్టోయినిస్, కైల్ జెమిసన్‌లను పంజాబ్ కింగ్స్ విడుదల చేసే అవకాశం ఉంది. ఫామ్ లేమి, గాయాల బెడద లాంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. కచ్చితంగా ఎక్కువ పర్స్ వాల్యూను పెట్టుకుని.. మినీ వేలంలో ప్రత్యేకంగా ఆల్‌రౌండర్లపై పంజాబ్ కింగ్స్ దృష్టి సారించే ఛాన్స్ ఉంది. కామెరాన్ గ్రీన్, క్లాసెన్ లాంటి వారిపై భారీగా బిడ్ వేయనుందని సమాచారం.

35
చెన్నై లిస్టు ఇదేనా

అటు చెన్నై సూపర్ కింగ్స్ విషయానికొస్తే.. రాహుల్ త్రిపాఠి, డెవాన్ కాన్వే, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ హుడా, విజయ్ శంకర్, నాథన్ ఎల్లిస్‌లను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎలాగో చెన్నై జట్టుకు టాప్ 3 కన్ఫర్మ్ అవ్వడంతో.. అటు రచిన్ రవీంద్ర కూడా రిలీజ్ అయ్యే అవకాశం లేకపోలేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టాప్ 3లో హార్డ్ హిట్టింగ్ యువ ఆటగాళ్ళను ఎంచుకుంది చెన్నై.

45
అవన్నీ పుకార్లే

అయితే శామ్ కర్రన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ విడుదల చేస్తుందన్న వార్తలు వచ్చినా.. అది వట్టి పుకార్లేనని సీఎస్కే అంతర్గత వర్గాలు కొట్టిపారేశాయి. అతడు జట్టుతోనే కొనసాగుతాడని స్పష్టం చేశాయి. ఇక పంజాబ్ కింగ్స్ కూడా తమ రిలీజ్ లిస్టు ఏంటన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

55
పంజాబ్ లిస్టుపై ఉత్కంఠ

కొత్త కోచ్ రికీ పాంటింగ్, కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సారధ్యంలో గత ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్ చేరింది పంజాబ్. ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలని ఉవ్విళ్ళూరుతోంది. ఆ టీంలో ఒకరిద్దరు ప్లేయర్స్ తప్పితే.. మిగిలిన అందరూ కూడా జట్టు తరపున అద్భుత ప్రదర్శన కనబరిచారు. కాబట్టి ఈసారి ప్రత్యేకంగా ఆల్ రౌండర్లు, పేస్ బౌలర్లు, ఓపెనింగ్ బ్యాటర్లపై పంజాబ్ యాజమాన్యం దృష్టి సారించే ఛాన్స్ ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories