IPL Brand Value: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలు తలో 5 ఐపీఎల్ ట్రోఫీలతో అత్యంత విజయవంతమైన జట్లుగా కొనసాగుతున్నాయి. అయితే, బ్రాండ్ వ్యాల్యూ పరంగా మాత్రం ఈ రెండు దిగ్గజ జట్లకు ఊహించని షాక్ తగిలింది.
ఐపీఎల్ లీగ్ వ్యాల్యూ రూ. 1.75 లక్షల కోట్లు.. మరి టాప్ లో ఉన్న టీమ్స్ ఏవి?
2007 టీ20 వరల్డ్ కప్ సక్సెస్ తర్వాత భారత్‌లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్టింగ్ ఈవెంట్లలో ఒకటిగా మారింది. దాదాపు రెండు నెలల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ప్లేయర్లు ఒకే దగ్గర పోటీపడే ఈ లీగ్, క్రికెట్ లవర్స్ కు పండుగలా మారింది. బాలీవుడ్ స్టార్స్, బడా బిజినెస్ మెన్ చేతుల్లో ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు కాలక్రమేణా వ్యాపార పరంగా ఊహించని ఎత్తులకు ఎదిగాయి.
అమెరికన్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కమర్షియల్ లీగ్‌గా ఐపీఎల్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఐపీఎల్ మొత్తం బిజినెస్ వ్యాల్యూ 20.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.75 లక్షల కోట్లు) మార్కును దాటేసింది. 2026 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అత్యధిక బ్రాండ్ వ్యాల్యూ ఉన్న ఫ్రాంచైజీగా అగ్రస్థానంలో నిలవగా, మిగిలిన జట్లు కూడా భారీగా పుంజుకున్నాయి.
26
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2025, 2026 సీజన్లలో వరుసగా ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకుని, లీగ్ చరిత్రలో వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన మూడో టీమ్‌గా నిలిచింది. ఇటీవల బ్లాక్‌స్టోన్, బోల్ట్ వెంచర్స్, ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌ల కూటమి $1.78 బిలియన్ల విలువ వద్ద ఈ ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని దక్కించుకుంది.
గత 12 నెలల్లో ఆర్సీబీ వ్యాల్యూ 269 మిలియన్ డాలర్ల నుంచి 16% పెరిగి 312 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 2,620 కోట్లు) చేరింది. ప్రపంచంలోనే 300 మిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూ మార్కును దాటిన తొలి క్రికెట్ టీమ్‌గా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది.
36
ముంబై ఇండియన్స్, కేకేఆర్ జోరు
ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) 264 మిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ముంబై వ్యాల్యూ 9.1% పెరిగింది.
ఇక మూడుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 245 మిలియన్ డాలర్ల వ్యాల్యూతో మూడో స్థానంలో ఉంది. కేకేఆర్ వ్యాల్యూలో గత ఏడాదితో పోలిస్తే 7.9% ఎదుగుదల నమోదైంది.
ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 244 మిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో నాలుగో స్థానంలో నిలిచింది. సీఎస్కే వ్యాల్యూలో గత ఏడాదితో పోలిస్తే 3.8% పెరుగుదల కనిపించింది.
మన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 168 మిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ వ్యాల్యూ ఈసారి 9.1% పెరిగింది.
56
రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్
మిట్టల్ ఫ్యామిలీ, ఆధార్ పూనావాలా ఆధ్వర్యంలో $1.65 బిలియన్ల వ్యాల్యూతో నడుస్తున్న రాజస్థాన్ రాయల్స్ (RR) 161 మిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో ఆరో స్థానంలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే రాజస్థాన్ 10.3% ఎదుగుదల సాధించింది.
పంజాబ్ కింగ్స్ (PBKS) 158 మిలియన్ డాలర్ల వ్యాల్యూతో ఏడో స్థానంలో నిలిచింది. టైటిల్ గెలవకపోయినా, పంజాబ్ టీమ్ వ్యాల్యూ సంవత్సరానికి 12.1% పెరిగింది.
66
గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఎల్‌ఎస్‌జీ
ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన తొలి ఏడాదే (2022) టైటిల్ కొట్టిన గుజరాత్ టైటాన్స్ (GT) 157 మిలియన్ డాలర్ల వ్యాల్యూతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఐదేళ్లలో మూడుసార్లు ఫైనల్ చేరిన గుజరాత్ వ్యాల్యూ 10.6% పెరిగింది.
ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని ఢిల్లీ క్యాపిటల్స్ (DC) 156 మిలియన్ డాలర్ల వ్యాల్యూతో (2.6% పెరుగుదల) తొమ్మిదో స్థానంలో నిలిచింది. సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 122 మిలియన్ డాలర్ల వ్యాల్యూతో పదో స్థానంలో ఉంది. ఎల్‌ఎస్‌జీ బ్రాండ్ వ్యాల్యూలో గత ఏడాదితో పోలిస్తే ఎటువంటి మార్పు లేదు.