Vaibhav Suryavanshi : బుమ్రా బౌలింగ్ లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేని హిట్టర్లు.. వైభవ్ వీళ్లందరికంటే తోపు..!

Published : Apr 10, 2026, 12:23 PM IST

సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లాంటి స్టార్ ప్లేయర్లే టీ20ల్లో బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్ కొట్టలేకపోయారు. కానీ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

PREV
110
వైభవ్ ధైర్యం...

Indian Premier League 2026 : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఒక 15 ఏళ్ల కుర్రాడి అసామాన్య ధైర్యానికి గుర్తుగా నిలిచిపోతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్ గా వెలుగొందుతున్న టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కొన్న తొలి ఓవర్లోనే వైభవ్ సూర్యవంశీ రెండు భారీ సిక్సర్లు బాది అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

210
పవర్ హిట్టర్లకు సాధ్యం కానిది..
టీ20 క్రికెట్‌లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ లాంటి స్టార్ బ్యాటర్లకు కూడా సాధ్యం కాని ఘనత ఇది. బుమ్రాను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాది వైభవ్ ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు.
310
బుమ్రాను షాక్‌కు గురిచేసిన ఆరంభం
బుమ్రా తనవైపు వేసిన మొదటి బంతినే వైభవ్ లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్ బాదాడు. ఆ షాట్ చూసి సాక్షాత్తూ బుమ్రా కూడా నవ్వాడు. కానీ వైభవ్ అక్కడితో ఆగలేదు. అదే ఓవర్ నాలుగో బంతికి బుమ్రా వేసిన స్లోవర్ డెలివరీని కరెక్ట్‌గా అంచనా వేసి, మిడ్ వికెట్ మీదుగా రెండో సిక్సర్ కూడా కొట్టాడు.
410
దిగ్గజాలకూ అసాధ్యమైన ఘనత..

వైభవ్ ప్రదర్శన ఎందుకు ఇంత ప్రత్యేకమో తెలియాలంటే అంతర్జాతీయ స్టార్ల రికార్డులు చూడాలి. టీ20 క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, ట్రావిస్ హెడ్ లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఇప్పటివరకు ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు.

510
గిల్ vs బుమ్రా
గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జస్ప్రీత్ బుమ్రాపై ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఇప్పటివరకు కేవలం 34 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బుమ్రా బౌలింగ్‌లో గిల్ కేవలం నాలుగు ఫోర్లు మాత్రమే కొట్టాడు. అతని ఖాతాలో ఒక్క సిక్స్ కూడా లేదు.
610
అభిషేక్ vs బుమ్రా
సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మొదటి బంతికే సిక్సర్ కొట్టగల సమర్థుడు. అయినా బుమ్రాపై ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. బుమ్రా బౌలింగ్‌లో అభిషేక్ కేవలం 17 పరుగులు చేసి, ఒకే ఒక్క బౌండరీ కొట్టాడు.
710
ట్రావిస్ హెడ్ vs బుమ్రా
ఆస్ట్రేలియా, హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ వరల్డ్ కప్‌లో టీమిండియాకు తలనొప్పిగా మారాడు. కానీ బుమ్రా ముందు మాత్రం అతను తేలిపోయాడు. బుమ్రాపై 8 ఇన్నింగ్స్‌లలో 57 పరుగులు చేసిన హెడ్, ఎనిమిది ఫోర్లు కొట్టినా.. ఒక్క సిక్సర్ కూడా బాదలేకపోయాడు.
810
పూరన్ vs బుమ్రా
లక్నో సూపర్ జెయింట్స్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్ కూడా బుమ్రాపై ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు. బుమ్రాపై ఆడిన ఆరు మ్యాచ్‌లలో 17 పరుగులు చేసిన పూరన్, కేవలం రెండు బౌండరీలు మాత్రమే సాధించాడు.
910
సంజూ vs బుమ్రా
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజూ శాంసన్ ఐపీఎల్‌లో బుమ్రాను అత్యధికంగా ఎదుర్కొన్న స్టార్ ప్లేయర్లలో ఒకడు. బుమ్రాపై 13 మ్యాచ్‌లు ఆడిన సంజూ, కేవలం 64 పరుగులు మాత్రమే చేశాడు. అతని పేరు మీద 9 బౌండరీలు ఉన్నప్పటికీ, బుమ్రాపై ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు.
1010
బుమ్రాకే చుక్కలు..

కేవలం 15 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌ను ఇంత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్‌లో తర్వాతి సంచలనం అవుతాడని క్రీడా విశ్లేషకులు అప్పుడే అంచనా వేస్తున్నారు. బుమ్రా బౌలింగ్ లోనే ఇలా ఆడాటంటే అతడు ఎవరి బౌలింగ్ లో అయినా అలవోకగా బౌండరీలు బాదగలడని అర్థమవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories