సముద్రపు నీరు తాగడానికి పనికి రాదన్న సంగతి మనకందరికీ తెలుసు. అయితే ఈ వాటర్ ఎందుకు ఉప్పగా ఉంటుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పురాణాల ప్రకారం.. సముద్రపు నీరు ఉప్పుగా మారడానికి ఒక బలమైన కారణం ఉంది. అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
శివపురాణం ప్రకారం.. ఒకప్పుడు పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేసేది. ఈ సమయంలోనే సముద్ర దేవుడి కన్ను పార్వతీదేవిపై పడిది. సముద్రదేవుడు పార్వతీదేవి అందానికి ముగ్ధుడయ్యాడు. పార్వతీదేవి తపస్సు పూర్తైన తర్వాత ఆమెదగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకోవాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. కానీ శక్తి దేవి అతని ప్రతిపాదనను తిరస్కరించింది. నేను శంకరుడినే నా భర్తగా భావిస్తున్నానని సముద్రదేవుడితో చెప్పింది.
దీనికి ఆగ్రహించిన సముద్రదేవుడు పార్వతీదేవితో 'నాలో లేని శివుడిలో ఏముంది’మానవులందరి దాహార్తిని తీరుస్తాను. నేను పాలలా తెల్లగా ఉంటాను అని పార్వతీ మాతతో సముద్రదేవుడు అంటాడు.
పార్వతీదేవి శాపం
సముద్ర దేవుడి తననే పెళ్లిచేసుకోమని పార్వతీదేవిపై ఒత్తిడి తెస్తాడు. దీనికి ఆ తల్లి తీవ్ర ఆగ్రహానికి గురై సముద్రదేవుడిని శపిస్తుంది. నీలో ఇంత అహంకారం ఉన్న మధుర జలం ఎప్పటికీ ఉప్పగానే ఉంటుందని పార్వతీదేవి సముద్రదేవుడికి శాపం పెడుతుంది. అలాగే ఈ నీటిని ఎవరూ తాగలేరు అని కూడా శాపిస్తుంది. ఆ రోజు నుంచి సముద్రపు నీరు ఎప్పటికీ ఉప్పుగానే ఉంటుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. దీనితో పాటు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో సముద్రపు నీరు ఉప్పగా మారిందని కూడా చెప్తారు.