దీపం వెలిగించేటప్పుడు ఈ తప్పులు మాత్రం చేయకండి.. పూజ చేసిన ఫలితం కూడా ఉండదు

First Published | Dec 1, 2023, 9:47 AM IST

మత విశ్వాసాల ప్రకారం.. దేవుడిని పూజించేటప్పుడు దీపాలను ఖచ్చితంగా వెలిగిస్తారు. అలాగే ఇంటి ప్రధాన గుమ్మం ముందు కూడా దీపాన్ని పెడతారు. ఈ దీపం లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుందని నమ్ముతారు. అయితే దీపాన్ని వెలిగించే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు చేసినా.. మీరు పెద్ద సమస్యలనే ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు అంటున్నారు. 
 

హిందూ మతంలో ఆరాధనకు, హారతికి, దీపాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపాలను వెలిగించే సంప్రదాయం ఎంతో పురాతనమైనది. ఈ సంప్రదాయాలు చాలా ఫలవంతమైన ప్రభావాలను కలిగి ఉంటాయని జ్యోతిష్యులు అంటారు. అయితే మత విశ్వాసాల ప్రకారం..  దేవుడికి పూజ చేసే సమయంలో ఖచ్చితంగా దీపాలను వెలిగిస్తారు. అలాగే ప్రధాన గుమ్మం వద్ద లక్ష్మీదేవికి స్వాగతం పలికేందుకు కూడా దీపాలను వెలిగిస్తారు.
 

అయితే పూజా సమయంలో దీపాలను వెలిగించేటప్పుడు తెలిసో, తెలియకో చిన్న చిన్న పొరపాట్లను చేస్తుంటారు. వీటివల్ల ఏమౌతుందిలే అని లైట్ తీసుకుంటారు. కానీ జ్యోతిష్యుల ప్రకారం.. ఈ పొరపాట్ల వల్ల కూడా మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే దీపాలను వెలిగించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Latest Videos


ఈ ప్రదేశంలో దీపం వెలిగించండి

మత విశ్వాసాల ప్రకారం.. సాయంత్రం పూట ఇంటి ప్రధాన గుమ్మం వద్ద దీపం వెలిగించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. కానీ దీనిని సరైన ప్రదేశంలోనే పెట్టాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. నిజానికి ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ప్రధాన ద్వారం వద్ద ఉన్న దీపాన్ని కుడివైపున వెలిగించాలి. అయితే ఈ దీపం పడమటి దిశలో కనిపించకుండా చూసుకోవాలి. 
 

నెయ్యి లేదా నూనె?

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. దీపాన్ని వెలిగించడానికి ఆవు నెయ్యి లేదా ఆవాల నూనె, నువ్వుల నూనెను వాడాలి. అయితే దీపాన్ని వెలిగించడానికి నెయ్యి లేకపోతే నూనెను కూడా వాడుకోవచ్చు.
 

దీపం ముఖం ఏ వైపు ఉండాలి? 

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. దీపాల ముఖం ఎప్పుడూ కూడా తూర్పు లేదా ఉత్తర దిశలోనే ఉండాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. సనాతన ధర్మంలో ఈ రెండు దిక్కులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే దీపం ముఖాన్ని ఈ దిశ వైపు ఉంచడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

సాయంత్రం దీపం వెలిగించాలి

మత విశ్వాసాల ప్రకారం.. సాయంత్రం పూట ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. వీటితో పాటుగా ఇంట్లో తులసి, అరటి, జమ్మి చెట్టు ఉంటే వాటి ముందు దీపాన్ని వెలిగించండి. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. 
 

click me!