శివుడిని సోమవారమే ఎందుకు పూజించాలి

First Published | Aug 18, 2024, 5:23 PM IST

హిందూ ధర్మంలో ఒక్కో వారానికి ఒక్కో దేవుడిని పూజించడం ఆచారంగా వస్తోంది. ఆదివారం సూర్యుడిని, సోమవారం శివుడిని, మంగళవారం హనుమాన్, సుబ్రహ్మణ్య స్వామిని, బుధవారం అయ్యప్పని, గురువారం సాయిబాబాను, శుక్రవారం అమ్మవారిని, శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. ఆ రోజుల్లో ప్రత్యేకంగా ఆ దేవుళ్ల ఆలయాలకు వెళతారు. మరి ప్రత్యేకంగా ఆ వారంలోనే ఆ పర్టిక్యులర్ దేవుళ్లను ఎందుకు పూజించాలో మీకు తెలుసా.. వీటిల్లో సోమవారం శివుడిని ఎందుకు పూజించాలో, పురాణాలు, పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
 

సోమవారం శివుడిని పూజించడానికి కారణాలను తెలిపే రెండు పురాణాలున్నాయి. అవి సోమనాథ పురాణం, శివ పురాణం. ఇవే కాకుండా అనేక వ్రతకథల్లోనూ సోమవారం విశిష్టతను వివరించారు. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు, అర్జునుడు ఇలా అనేక మంది సోమవారం పూజలు, వ్రతాలు ఆచరించారు. 

సోమనాథ పురాణంలో ఏముందంటే..

సోమనాథ పురాణం ప్రత్యేకంగా చంద్రుడి గురించి చెబుతుంది. సోమ అంటే చంద్రుడు అని అర్థం. ఈ పురాణంలో ఏముందంటే.. చంద్రుడికి 27 మంది భార్యలు. వారిలో పృధ్వీ కుమార్తె అయిన రోహిణిని చంద్రుడు ఎక్కువగా ప్రేమించేవాడట. దీంతో కోపగించిన మిగిలిన 26 మంది భార్యలు దక్ష ప్రజాపతి వద్దకు వెళ్లారట. ఆయన చంద్రుడిని క్షీణించిపోవాలని శపించారట. చంద్రుడు భయంతో శివుడి దగ్గరకు వచ్చి కాపాడమని వేడుకొన్నాడు. అప్పడు చంద్రుడిని తన శిఖపై ఆభరణంగా శివుడు పెట్టకున్నాడని సోమనాథ పురాణంలో ఉంది. సోముడిని అనుగ్రహించిన రోజు కావడంతో ఆ రోజు శివుడిని పూజిస్తే కరుణిస్తాడని భక్తుల విశ్వాసం.


శివ మహా పురాణం ఏం చెబుతోంది..

శివ మహా పురాణంలో సోమవారం వ్రతం గురించి వివిధ సందర్భాల్లో చెప్పారు. పార్వతీదేవి కూడా శివుడి అనుగ్రహం పొందడానికి సోమవారం వ్రతం చేసిందట. ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు, అర్జునుడు కూడా సోమవారం వ్రతం చేసి దివ్య శక్తులను పొందినట్లు ఉంది. అందువల్ల ఈ కలియుగంలో కూడా సోమవారం శివుడికి పూజ చేయడం వల్ల కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
 

సోమవారం పూజించడం వల్ల లాభాలు..

సోమవారం శివుడికి అభిషేకం చేయడం వల్ల పూర్వ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయట. ప్రస్తుత జీవితంలో మనశ్శాంతి కలుగుతుందట. భాధలు పోయి సుఖ సంతోషాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. 

ఆయుష్షు పెరుగుతుందట.

మార్కండేయ పురాణంలో మార్కండేయుడు సోమవారం రోజునే శివుడికి పూజ చేసి దీర్ఘాయువు పొందాడట. అందువల్ల భక్తులు కూడా సోమవారం శివుడిని పూజించడం వల్ల  ఆయుష్షు పెరుగుతుందని చెబుతున్నారు. 

Latest Videos

click me!