హనుమాన్ చాలీసా రోజూ చదివితే ఎంత మంచిదో తెలుసా

First Published | Aug 17, 2024, 6:32 PM IST

శ్రీరామ చంద్రుడి సేవ కోసమే పుట్టి, నిరంతరం రామ నామం జపిస్తూ చిరంజీవిగా నిలిచిన హనుమంతుడి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీరాముడి కష్టాన్నే తీర్చిన ఆంజనేయుడు భక్తుల కష్టాలు తీర్చకుండా ఉంటాడా.. అయితే చేయాల్సింది ఏంటంటే భక్తిగా హనుమాన్‌ చాలీసా పారాయణం చేయడమే.. ఈ చాలీసా చదవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పండితులు తెలిపిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
 

చాలీసా అంటే 40 అని అర్థం. అంటే హనుమాన్ చాలీసాలో 40 చరణాలు ఉంటాయన్న మాట. దీన్ని గొప్ప కవి తులసీ దాస్ రచించారు. 16వ శతాబ్దంలో అవధి అనే భాషలో తులసీదాస్ ఈ హనుమాన్ చాలీసాను రచించారు. అయితే వివిధ భాషల్లోకి ట్రాన్స్ లేట్ అయ్యింది. తులసీదాస్ రామాయణం కూడా రాశారు. దీన్ని రామచరితమానస్ అంటారు. 
 

హనుమాన్ చాలీసా చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు

శ్రేయస్సు.. ఈ చాలీసా పఠించిన వారికి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. కష్టాలు తొలగుతాయి.
సంకల్ప బలం.. చాలీసా చదవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ప్రాబ్లమ్స్ ను ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తినిస్తుంది. 
శత్రువుల నుంచి రక్షణ.. హనుమాన్ చాలీసా రోజూ చదవడం వల్ల మనలో భయం పోతుంది. శత్రువులు కూడా మనకు హాని చేయడానికి భయపడతారు. 
ఆరోగ్యం.. చాలీసాను చక్కటి పదాలు, స్వరంతో 40 చరణాలుగా తులసీదాసు రచించారు. తప్పులు లేకుండా చదివితే శరీరంలో నాడులు యాక్టివేటై వ్యాధులు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా రోజూ పారాయణం చేయడం వల్ల కొత్త రోగాలు రావంటున్నారు.  


తప్పులు లేకుండా చదవడం ముఖ్యం..

సాధారణంగా చాలామంది హనుమాన్ చాలీసా చాలా సింపుల్ గా చదివేస్తారు. అయితే వారు కోరుకున్న కోరిక నెరవేరలేదని ఫీలవుతుంటారు. ఒక పని కావాలని సంకల్పించినప్పుడు భక్తి, శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించాలని, మొక్కుబడిగా చదవడం వల్ల ప్రయోజనం ఉండదని పండితులు చెబుతున్నారు. తప్పులు లేకుండా చాలీసా చదవడం చాలా ముఖ్యమని అంటున్నారు. 
 

ఎప్పుడు పారాయణ చేయాలి..

హనుమాన్ చాలీసా ఉదయం, సాయంత్రం స్నానం చేసిన తర్వాత చదవడం మంచిదట. టైం లేకపోతే ప్రశాంత వాతావరణంలో కూర్చొనైనా చదువుకోవచ్చట.  మీకున్న సమయాన్ని బట్టి ఎంత ఎక్కువ సార్లు చదివితే అంత ప్రయోజనం ఉంటుందని పండితులు చెబుతున్నారు. 
 

ఎన్ని సార్లు చదవాలి..

మీ కోరిక ఎంత బలంగా ఉంటే అన్ని ఎక్కువ సార్లు హనుమాన్ చాలీసా చదవాలంటున్నారు. కనీసం ఉదయం, సాయంత్రం పఠించాలి. లేకపోతే 3, 9, 11, 21, 108 సార్లు.. ఇలా మీకున్న సమయాన్ని చూసుకొని చదవడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయట. దీక్షగా 41 రోజులు హనుమాన్ చాలీసా చదివితే కచ్చితంగా సంకల్పం నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. 
 

Latest Videos

click me!