స్కంద పురాణం ప్రకారం.. తులసి కోట దగ్గర రోజూ సాయంత్రం దీపం పెడితే ఏమౌతుంది..?

First Published Jun 13, 2024, 11:58 AM IST

స్కంద పురాణం ప్రకారం తులసి మొక్కను నాటడం, దాని దగ్గర దీపం వెలిగించడం, మొక్కను సంరక్షించడం, తులసి మొక్కను పూజించడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుందట.

ఇంట్లో తులసి మొక్క ఉంటే... మంచిది అని పెద్దలు చెబుతూ ఉంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం తులసి మొక్కను చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.  స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు.  రోజూ తులసి మొక్కకు నీరు సమర్పించి.. ఆ మొక్క ముందు నూనె లేదంటే... నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఆ కుటుంబంలో సమస్యలు రావని, ఆనందంగా ఉంటారని నమ్ముతారు. ఎక్కువ మంది,.. రోజూ ఉధయం వేళ.. ఆ తులసి మాత దగ్గర దీపం పెడుతూ ఉంటారు. అయితే కేవలం ఉదయం మాత్రమే కాదు.. సాయంత్రం వేళ కూడా దీపం పెట్టాలట. అలా పెట్టడం వల్ల.. మీరు జీవితంలో ఎన్నడూ చూడని సంతోషాలను చూసే అవకాశం ఉందట. ఆ లాభాలేంటో ఓసారి చూద్దాం...

తులసి మొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు. తులసిని లక్ష్మీదేవి అవతారంగా కూడా పరిగణిస్తారు. స్కంద పురాణం ప్రకారం తులసి మొక్కను నాటడం, దాని దగ్గర దీపం వెలిగించడం, మొక్కను సంరక్షించడం, తులసి మొక్కను పూజించడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుందట. మోక్షం కూడా లభిస్తుందట.

దీపం ఎలా వెలిగించాలి..?

హిందూ సంప్రదాయం ప్రకారం.. రోజూ తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం ఒక ఆచారంగా భావిస్తూ వస్తున్నారు.  తులసి కోట దగ్గర దీపం వెలిగించడం అనేది..  చీకటి పై కాంతి, అజ్జానం పై  జ్ఞానం, చెడుపై మంచి  విజయానికి చిహ్నం గా భావిస్తారు.  దియాను వెలిగించడం అనేది చీకటి, అజ్ఞానంతో నిండిన ప్రదేశంలో జీవితాన్ని నింపడం లాంటిది. ఇది దైవానికి నైవేద్యం లాంటిది . ఎలాంటి ప్రతికూల శక్తులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుందని నమ్ముతారు.
 

జీవితంలో మనిషి అన్నవాడు పాప పుణ్యాలు చేస్తూనే ఉంటాడు. అయితే...  ఎన్ని పాపాలు చేసిన వారు అయినా.... తులసి కోట వద్ద సాయంత్రం వేళ దీపం వెలిగించడం వల్ల.. చనిపోయిన తర్వాత నరకానికి కాకుండా.. స్వర్గానికి చేరతారట. మనిషి చనిపోయిన తర్వాత కూడా నోటిలో తులసి ఆకులు పెడుతూ ఉంటారు. దాని వల్ల ఆ వ్యక్తి స్వర్గానికి వెళతాడు అని నమ్ముతారు. ఆత్మకు విముక్తి కలుగుతుందట.
 

తులసి మొక్క లక్ష్మి, విష్ణువుల ఆశీస్సులు

తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి, విష్ణువుమిళిత ఆశీర్వాదాలు లభిస్తాయి. సంపద  శ్రేయస్సు  దేవత అయిన లక్ష్మి, ఇంటిని సమృద్ధిగా ఆశీర్వదిస్తుంది. విష్ణుమూర్తి  సంరక్షకుడు , రక్షకుడు, కుటుంబ రక్షణ , శ్రేయస్సును అందిస్తాడట.
 

ఇక.. దీపం ఏ సమయంలో వెలిగించాలో కూడా తెలుసుకోవాలి..
తులసి కోట ముందు దీపం ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు. ఉదయంపూట సూర్యుడు రాకముందు వెలిగిస్తే మంచిది. ఇక.. సాయంత్రం వేళ అంటే... సూర్యాస్తమయానికి కొద్దిసేపటి ముందు దియా వెలిగించాలి. ఈ సమయం పగలు నుండి రాత్రికి మారడాన్ని సూచిస్తుంది. కాబట్టి, ఈ సమయంలో దీపాన్ని వెలిగించడం చీకటిని తొలగించి కొత్త కాంతిని ప్రకాశింపజేయడానికి చిహ్నం. తరువాత, మీరు దియాను వెలిగించడానికి నూనెను ఉపయోగించకుండా చూసుకోండి, బదులుగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కోసం వెళ్లండి ఎందుకంటే ఇది స్వచ్ఛతకు చిహ్నం. తులసి మాతకు నీరు సమర్పించి.. తర్వాత దీపం వెలిగించడం ఉత్తమం.

Latest Videos

click me!