తక్కువ అంచనా వేయకండి... పెరుగుతో అశుభాలు కూడా శుభమౌతాయా..?

First Published Jun 13, 2024, 11:01 AM IST

భారతదేశంలోని గొప్ప మత సంప్రదాయాలలో, పురాతన కాలం నుంచి పెరుగును వివిధ ప్రదేశాలలో ఉపయోగిస్తూ వస్తు్నారు. ఇది స్వచ్ఛత, ఆరోగ్యం, శ్రేయస్సు కు చిహ్నంగా పరిగణిస్తారు. 

 పెరుగు చాలా మంది ఆహారం గా మాత్రమే భావిస్తారు. కానీ పెరుగుకు మన భారతీయ సంస్కృతీ సంప్రదాయంలో చాలా  విలువ ఉంటుంది. కేవలం రెండు, మూడు స్పూన్ల పెరుగు అశుభాన్ని కూడా.. శుభంగా మారుస్తుందని జోతిష్యశాస్త్రం చెబుతోంది. ఎందుకంటే...  మీరు ఏదైనా పని మొదలుపెడుతున్నప్పుడు.. స్పూన్ పెరుగు తినమని.. ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. అలా చేయడం వల్ల... ఆ పని దివ్యంగా జరుగుతుందని..  ఎలాంటి నష్టం జరగదని నమ్ముతారు.  ఎలాంటి పనికైనా శుభ ఫలితాలు ఇవ్వడంలో... పెరుగు మనకు సహాయపడుతుందట.

ఎవరైనా సరే... పని ప్రారంభించే సమయంలో  లేదంటే ఎక్కడికైనా వెళ్లేటప్పుడు, ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు పెరుగుతో పంచదార కలిపి తినిపిస్తూ ఉంటారు. అంతెందుకు.. ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సమయంలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆయనకు పెరుగు, పంచదార కలిపి తినిపించారు. జోతిష్యశాస్త్రం ప్రకారం... పెరుగు ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం....
 

భారతదేశంలోని గొప్ప మత సంప్రదాయాలలో, పురాతన కాలం నుంచి పెరుగును వివిధ ప్రదేశాలలో ఉపయోగిస్తూ వస్తు్నారు. ఇది స్వచ్ఛత, ఆరోగ్యం, శ్రేయస్సు కు చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే.. పూజల్లో పెరుగును వాడుతూ ఉంటారు.  గ్రహాల శాంతి, సానుకూల శక్తిని పొందడానికి కూడా పెరుగును ఉపయోగిస్తారు.

చాలాసార్లు దేవుళ్లకు అభిషేకం చేసే సమయంలోనూ పెరుగును వాడుతూ ఉంటారు. అలా పెరుగుతో అభిషేకం చేయడం వల్ల.. ఆ దేవుడి అనుగ్రహం మనకు లభిస్తుందట. పెరుగుకు మతపరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా ఉంది. పెరుగు భారతీయ సమాజంలో పవిత్రమైనది గా పరిగణిస్తారు. ఇది వివిధ మతపరమైన వేడుకలు , ఆచారాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. పెరుగును ప్రసాదంగా పంచే సంప్రదాయం కూడా ప్రబలంగా ఉంది, ఇది మతపరమైన ఆచారాలలో అంతర్భాగంగా చేస్తుంది.
 


శుభకార్యాల్లో పెరుగు ప్రాముఖ్యత...

చాలా రకాల శుభకార్యాల్లో పెరుగును ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా,  వివాహం, గృహప్రవేశం వంటి ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు లేదా కొత్త ఉద్యోగం వంటి కొత్త పనిని ప్రారంభించే ముందు పెరుగును సేవించి ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. ఇది 'పెరుగు-చక్కెర' రూపంలో ఇస్తారు. ఇది స్వచ్ఛత , తీపిని సూచిస్తుంది. ఈ అలవాటును శుభ చిహ్నంగా పరిగణిస్తారు.  ఏదైనా ప్రయాణానికి ముందు పెరుగు , చక్కెర తీసుకోవడం వల్ల ప్రయాణం శుభప్రదంగా , సురక్షితంగా ఉంటుందని నమ్ముతారు. ఇది భగవంతుని అనుగ్రహం పొందే మార్గంగా పరిగణిస్తారు.

ఇక.. గ్రహాల విషయానికి వస్తే...  పెరుగును చంద్రుడి మనసుతో పరిగణిస్తారరు.  ఇది శాంతి,సౌమ్యత, మానసిక సమత్యులకు సంబంధించనది గా భావిస్తారు.  ఇది శాంతి, సౌమ్యత , మానసిక సమతుల్యతకు సంబంధించినది. పెరుగు తినడం , దానం చేయడం చంద్రుని శాంతికి శుభప్రదంగా పరిగణిస్తారు. మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే, సోమవారం పెరుగు తినడం మీకు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.ఇది మనస్సుకు శాంతి, సమతుల్యతను అందిస్తుంది.

curd

రాహు, కేతువు వంటి కొన్ని గ్రహ దోషాల  అశుభ ప్రభావాలను తగ్గించడానికి కూడా పెరుగును ఉపయోగిస్తారు. రాహువు శాంతి కోసం, నల్ల నువ్వులు పెరుగు దానం చేయడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇది రాహువు  అశుభ ప్రభావాలను తగ్గిస్తుంది. జీవితంలో శాంతి , స్థిరత్వాన్ని కలిగిస్తుంది.

శుక్ర గ్రహం సుఖాలు , శ్రేయస్సుకు సంబంధించినది. శుక్ర గ్రహాన్ని బలోపేతం చేయడానికి పెరుగు తినడం , దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. శుక్రవారం రోజు పెరుగు, ఉపవాసం తీసుకోవడం వల్ల శుక్రుడు సంతోషిస్తాడు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు , వైవాహిక జీవితంలో ఆనందం పొందుతారు. అందుకే.. ఏదైనా మంచి కార్యం మొదలుపెట్టినప్పుడు పెరుగును తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు విజయం వరిస్తుంది. 
 

Latest Videos

click me!