ఏ చెట్టులో ఏ దేవతలు, దేవుళ్లు ఉంటారో తెలుసా?

First Published | Jun 6, 2024, 4:12 PM IST

హిందూ మతంలో మొక్కలను, చెట్లను పవిత్రంగా భావిస్తారు. వాటికి పూజలు చేస్తారు. చెట్లను, మొక్కలను పూజించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. 
 

హిందూ మతంలో.. మొక్కలు, చెట్లను దేవుళ్లు, దేవతల నివాసంగా భావిస్తారు. మొక్కలకు ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని భావిస్తారు. వీటిని పూజిస్తే దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. చెట్లు, మొక్కలను ప్రాణదాత శక్తి వనరులుగా పరిగణించడమే కాకుండా.. ఇవి దేవుళ్లు, దేవతల నివాసంగా కూడా పరిగణించబడతాయి. చెట్లు, మొక్కలు స్వచ్ఛతకు చిహ్నాలు. వీటికి పూజ చేస్తే మనస్సు పరిశుద్ధమై చేసిన పాపాలన్నీ నశిస్తాయి. చెట్లు, మొక్కలను ఎన్నో మతపరమైన ఆచారాలలో కూడా ఉపయోగిస్తారు. పూజలో పూలు, ఆకులను నైవేద్యంగా సమర్పించడం వంటివి చేస్తుంటారు. హిందూ మతంలో ఏయే మొక్కలు, చెట్లలో దేవతలు నివసిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఉసిరి చెట్టు

హిందూ మత గ్రంథాల ప్రకారం.. ఉసిరిచెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుంది. అందుకే కార్తీక, అశ్విని మాసాల్లో ఉసిరి చెట్టుకు పూజలు చేస్తారు. అలాగే  ఉసిరి చెట్టు కొమ్మలను, పండ్లు, ఆకులను పూజిస్తారు. ఇవే కాకుండా లక్ష్మీ, విష్ణువుల విగ్రహాలను ఉసిరి చెక్కతో తయారు చేసి ఇళ్లలో పూజిస్తారు.



మారెడు చెట్టు 

శివ పురాణం ప్రకారం.. మారెడు చెట్టులో శివుడు నివసిస్తాడని వర్ణించబడింది. అందుకే శివ పూజలో మారెడు ఆకులను సమర్పిస్తారు. క్రమం తప్పకుండా మారెడు చెట్టును సందర్శించడం, తాకడం, పూజించడం వంటివి చేస్తే దుఃఖాలు, పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.  శివారాధనలో మారెడు ఆకులను, పండ్లు, కలపకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టును శివుని రూపంగా భావిస్తారు. బ్రహ్మ, విష్ణు, శివుడు నివసించే త్రిదేవుని రూపంగా కూడా మారెడు చెట్టును భావిస్తారు.
 


అరటి చెట్టు

అరటిచెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని నమ్ముతారు. ఈ చెట్టును గురువారం నాడు పూజిస్తారు. అరటి చెట్టు లేకుండా బృహస్పతి ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అరటి చెట్టును దీపావళి అలంకరణకు కూడా ఉపయోగిస్తారు. అలాగే సత్య నారాయణ వ్రతంలో కూడా అరటి ఆకులు, చెట్లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శ్రీ మహావిష్ణువుకు అరటి పండు అంటే చాలా ఇష్టం. అందుకే దాని భోగాన్ని కూడా ఆయనకు సమర్పిస్తారు.
 

neem tree


వేప చెట్టు

వేపచెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ చెట్టును దుర్గాదేవి నివాసంగా భావిస్తారు. వేప ఆకులను దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా దుర్గా పూజకు ఉపయోగిస్తారు. అంతే కాకుండా సీతా దేవి కూడా వేపచెట్టులో నివసిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ చెట్టును పూజిస్తారు. ఈ చెట్టు ఒక్క భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ (బర్మా), థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంక మొదలైన దేశాలలో కూడా కనిపిస్తుంది.
 

పవిత్ర తులసి

పురాణాల ప్రకారం.. తులసి మొక్క విష్ణువు, లక్ష్మీదేవి సన్నిధిలో నివసిస్తుంది. శాలిగ్రామ్ స్వామి తులసి మూలాలలో నివసిస్తాడని నమ్ముతారు. తులసి ఆకులు, మంజరి అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. తులసి ఆకులను క్రమం తప్పకుండా శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తారు. అలాగే వారికి సమర్పించే భోగం లేదా ప్రసాదంలో తులసి ఆకులను కలుపుతారు. తులసి మొక్క ముందు నెయ్యి దీపాన్ని క్రమం తప్పకుండా వెలిగిస్తారు.

Latest Videos

click me!