దేవాలయాలు కొండపై ఉండటానికి మరిన్ని కారణాలు :
దేవుళ్లు ఆకాశంలో ఉంటారని అన్ని మతాల విశ్వాసం. మైదాన ప్రాంతాల కంటే ఎత్తైన కొండలు ఆకాశానికి దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఆ దేవుడికి దగ్గరగా ఉండేలా దేవాలయాలను కొండలపై నిర్మించారనే వాదన ఉంది.
ఇక కొండప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. కాబట్టి అక్కడ దేవాలయాలు నిర్మిస్తే భక్తులకు ప్రశాంతంగా దైవారాధన, ధ్యానం చేసుకోవచ్చు. ఆహ్లదకరమైన వాతావరణాన్ని అందించేందుకే దేవాలయాలను కొండలపై నిర్మించారని పెద్దలు చెబుతుంటారు.
పూర్వకాలంలో ఏ ఆపద వచ్చినా దేవాలయాలే ప్రజలను రక్షించేవి. అంటే వరదలతో పాటు ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలు తలదాచుకునే విధంగా దేవాలయాలను ఎత్తైన కొండలపై నిర్మించారని చెబుతుంటారు.
సాధారణంగా మైదానప్రాంతాల్లో కంటే కొండప్రాంతాల్లోని గాలిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. నైట్రస్ ఆక్సైడ్ ను లాఫింగ్ గ్యాస్ అని అంటారు... అంటే ఇది మనసును ప్రశాంతంగా ఉంచి హాయిగా నవ్వుకునేలా చేస్తుంది. ఇలా దేవాలయాల్లో కూడా ప్రశాంత వాతావరణం ఉండాలనే కొండప్రాంతాల్లో దేవాలయాలను నిర్మించి ఉంటారని సైన్స్ కూడా చెబుతోంది.,
దేవాలయాలను కొండలపై నిర్మించడం వెనుక శ్రద్ధ, భక్తి, విజ్ఞాన సూత్రమూ ఉంది. భక్తుడు శరీరంగా మాత్రమే కాదు, మనసుగా కూడా ఏకాగ్రతతో భగవంతుని వైపు ప్రయాణించాలనే సందేశాన్ని ఇది ఇస్తుంది. కొండ ఎక్కడం ద్వారా భౌతిక ప్రపంచం నుంచి స్వల్ప విరామం తీసుకుని, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టే అవకాశమిస్తాయి.