రుద్రాక్షలను ధరించి ఇక్కడికి అస్సలు వెళ్లకూడదు.. ఒకవేళ వెళ్లారో ఎంతో నష్టపోతారు జాగ్రత్త..

First Published | Nov 26, 2023, 10:34 AM IST

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. రుద్రాక్షలను ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. 1 నుంచి 14 ముఖాలున్న రుద్రాక్షలు ఉంటాయి. ఇవి వాటి స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అయితే కొన్ని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు రుద్రాక్షలు ధరించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. లేదంటే మీరెంతో నష్టపోవాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

సనాతన ధర్మంలో రుద్రాక్షలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే చాలా మంది రుద్రాక్షల దండను ధరిస్తుంటారు. నిజానికి రుద్రాక్షను ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. కానీ దీనిని ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా లేకపోతే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

రుద్రాక్ష ఎలా పుట్టింది? 

మత విశ్వాసాల ప్రకారం.. రుద్రాక్ష శివుని కన్నీటి నుంచి ఉద్భవించింది. అందుకే హిందూమతంలో రుద్రాక్షకు అంత ప్రాముఖ్యత ఉంది. రుద్రాక్షలు ధరించిన వ్యక్తిపై శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతారు.

Latest Videos


ఇక్కడ రుద్రాక్షలను ధరించకూడదు

రుద్రాక్షలు ధరించిన వ్యక్తి శ్మశాన వాటికకు గానీ, మరణించిన ప్రదేశానికి గానీ వెళ్లకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఒకవేళ మీరు అలాంటి ప్రదేశానికి వెళ్లాల్సి వస్తే వాటిని ముందుగానే తొలగించాలి. 

రాత్రి పడుకునే ముందు కూడా రుద్రాక్షను తొలగించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే నిద్రించేటప్పుడు మన శరీరం శుద్ధి చెందదని, రుద్రాక్షలు ధరించడానికి స్వచ్ఛత అవసరమని నమ్ముతారు.
 

బిడ్డ పుట్టిన తర్వాత..

ఇంట్లో బిడ్డ పుడితే ఆ సమయంలో కూడా రుద్రాక్షలు ధరించకూడదట. బిడ్డ పుట్టినప్పటి నుంచి 1 నెల వరకు రుద్రాక్షలను ధరించకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో పూజ వంటి పనులు కూడా చేయరు.

రుద్రాక్షలు ధరించి ఈ ప్రదేశానికి వెళ్లకూడదు

రుద్రాక్షలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే మాంసం, మద్యం ఉన్న ప్రదేశానికి ఎప్పుడూ వెళ్లకూడదు. అలాగే రుద్రాక్షలను ధరించి మద్యం సేవించకూడదు. ఇలా చేయడం వల్ల మీరు వ్యతిరేక ఫలితాలను పొందాల్సి ఉంటుంది. 
 

రుద్రాక్షలను ఎప్పుడు ధరించాలి?

రుద్రాక్షలు ధరించడానికి ఎన్నో పవిత్రమైన రోజులు ఉన్నాయి. అమావాస్య, పౌర్ణమి, శ్రావణ సోమవారం, శివరాత్రి నాడు రుద్రాక్షలు ధరించొచ్చు. కానీ రుద్రాక్షలు ధరించే ముందు పాలు, ఆవనూనెతో బాగా శుభ్రం చేసుకోవాలి.

click me!