గంగా స్నానం పూజా విధి
కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించాలి.
గంగా నదిలో పవిత్ర స్నానం చేయడానికి వీళ్లేకపోతే ఈ పవిత్రమైన రోజున మీ స్నానపు నీటిలో గంగా నీటిని కలపండి.
ఈ రోజున సూర్యభగవానుని పూజించడం కూడా ఎంతో ప్రయోజనకరంగా భావిస్తారు.
సూర్య భగవానునికి అర్ఘ్యం చేసేటప్పుడు 'ఓం ఆదిత్యాయ నమః' అని జపించండి. దీంతో మీరు ఆయన అనుగ్రహం పొందుతారు.
సాయంత్రం పూట గంగానదిలో స్నానం చేసే భక్తులు చంద్ర దేవుడికి అర్ఘ్యం సమర్పించాలి.
ఈ రోజున గంగామాత ముందు కనీసం ఒక్క దీపాన్నైనా వెలిగించండి. వీలైతే 7 దేశీ నెయ్యి దీపాలను వెలిగించడానికి ప్రయత్నించండి. ఇది మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.