Karthika Deepam 2023: దీపాలను వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాల గురించి ప్రతి ఒక్కరికీ తెలియకపోవచ్చు. దీనివల్లే దీపం వెలిగించేటప్పుడు కొన్ని తప్పులను చేస్తుంటారు. కానీ దీనివల్ల మీకు దీపాన్ని వెలిగించిన ప్రతిఫలం కూడా దక్కదు. కాగా మీరు ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. హిందూ మతంలో దీపాన్ని వెలిగించడం ఎంతో ప్రత్యేకం.
కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో దీపాలను వెలిగించడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపాలను వెలిగిస్తారు. ఈ రోజు దీపాలను వెలిగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారని నమ్ముతారు. కార్తీక మాసంలో దీపం వెలిగించి ఇంటిని అలంకరించుకోవడంలో తప్పులేదు. కానీ సరైన మార్గంలో దీపం వెలిగించడం చాలా ముఖ్యమంటున్నారు జ్యోతిష్యులు. అవును దీపాలను వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ పద్ధతుల్లో దీపాన్ని వెలిగించకపోతే ఎంతో ఎంతో నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే దీపాలను నియమాల ప్రకారం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శుభ్రమైన ప్రమిదలను ఉపయోగించండి
స్వచ్ఛమైన దీపం అటే గతంలో ఉపయోగించని దారం లేదా నూనె లేని శుభ్రమైన దీపమని అర్థం. పాత ప్రమిదలనే ఉపయోగించాలనుకుంటే వాటిని నీటితో బాగా శుభ్రం చేసి దీపాన్ని వెలిగించండి. పాత ప్రమిదలను శుభ్రం చేయకుండా ఉపయోగించకూడదు.
ఈ లోహాన్ని ఉపయోగించండి
శివుడి ముందు దీపాన్ని వెలిగించడానికి ఇత్తడి, రాగి, మట్టితో చేసిన దీపాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే ఇవి పవిత్రమైనవిగా పరిగణించబడుతాయి. అందుకే ఇతర లోహాలతో చేసిన దీపాలను ఉపయోగించకండి.
ఇత్తడి దీపాన్ని ఖాళీగా వెలగించకూడదు
వట్టి దీపాన్ని మాత్రమే వెలిగించకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంటే ఇత్తడి దీపంలో దీపం వెలిగించడానికి ముందు అందులో రెండు పసుపు బియ్యం, పూల రేకులు వేయండి. అలాగే నెయ్యి, ఆవనూనె, నువ్వుల నూనెలను కలిపి దీపాన్ని వెలిగించాలి. చాలా మంది తమకు తెలియకుండానే అన్ని దేవతామూర్తుల ముందు అన్ని రకాల దీపాలను వెలిగిస్తారు. కొన్ని నూనె దీపాలను కొన్ని ప్రత్యేక రోజులు, తేదీలు, దేవతలకు మాత్రమే అంకితం చేయబడ్డాయి. కాబట్టి తెలియకుండా దీపాలను వెలిగించకండి.