ఇంటి ముందు ముగ్గు వేస్తున్నారా అయితే వాటి వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా?

First Published | Dec 15, 2021, 4:13 PM IST

ఇంటి ముందు వేసే ముగ్గులలో (Muggu) అనేక ఆధ్యాత్మిక రహస్యాలు (Spiritual mysteries) దాగి ఉన్నాయి. ఇంటి ముందు గీసే రెండు అడ్డగీతలు దుష్టశక్తులను ఇంటిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు వెళ్ళకుండా చూస్తాయి. అయితే ఇంటి ముందర వేసే ముగ్గుకు శాస్త్రాల ప్రకారం అనేక అర్థాలు ఉన్నాయి. అవి వేటికీ శుభ సంకేతాలో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాత నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన (Auspicious) పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగ సమయంలో ఏ దేవతను అయితే పూజించాలని అనుకుంటున్నారో ఆ దైవాన్ని ఉంచే పీఠం మధ్య భాగంలో చిన్న ముగ్గు వేసి నాలుగు వైపులా రెండుడెసి గీతలు గీయాలి. నక్షత్ర ఆకారంలో వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు దుష్టశక్తులను (Evil spirits) దరిదాపులకు రాకుండా చూస్తుంది.
 

అలాగే మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. ఇవి రక్షణ రేఖలా (Line of defense) పనిచేస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇవి ఇంటి ప్రాంగణంలోకి చెడ్డ శక్తులను (Evil forces) దరిచేరిన ఇవ్వకుండా కాపాడుతాయి. అందుకే ఈ ముగ్గురు తొక్కరాదు అని పెద్దలు చెబుతారు. తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి. అలాగే యజ్ఞయాగాలు చేసే సమయంలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.
 

Latest Videos


అలాగే దైవ కార్యాలు చేపట్టే సమయంలో నాలుగు గీతలతో కూడిన ముగ్గు వేయాలి. ఇంటి ముందు దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని అస్సలు తొక్కరాదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలో అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైధవ్యం (Widowhood) రాదని సుమంగళిగా (Sumangali) మరణిస్తున్నారని దేవీ పురాణం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి.
 

అలాగే పండుగ సమయాలలో నడవడానికి వీలులేకుండా పెద్ద పెద్ద ముగ్గులు వేయరాదు. అలాగే రోజు ముగ్గు వేయడానికి వీలు లేని వారు ఇంటి ముందర పెయింట్ తో ముగ్గులు వేస్తూంటారు. కానీ ఇది ముగ్గుగా శాస్త్రం పరిగణించదు. ఏ రోజుకు ఆ రోజు ఇంటి ముందు, తులసి మొక్క ముందు బియ్యపుపిండితో (Rice flour) ముగ్గు పెట్టాలి. ఇంటి ముందర ముగ్గు దైవ శక్తులను ఇంటిలోనికి ఆహ్వానిస్తుంది. ఇంటిలోనికి పాజిటివ్ ఎనర్జీని (Positive energy) తెస్తాయి.
 

ఇంటిలోని కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు. పూర్వం రోజులలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో అశుభం (Ominous) జరిగిందని భావించేవారు పెద్దలు. ముగ్గు లేని ఇంటికి సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు భిక్షాటనకు వెళ్ళేవారు కాదు. ముగ్గు వెనుక అనేక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. ఇంటి ముందు ముగ్గు లక్ష్మీదేవిని (Lakshmi Devi) ఆ ఇంట్లో ఎప్పుడూ ఉండేలా చూస్తుంది.

click me!