తిరువనంతపురంలో ఖచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే!

First Published | Dec 7, 2021, 4:07 PM IST

తిరువనంతపురం (Thiruvananthapuram) త్రివేండ్ర అని కూడా పిలువబడుతోంది. ఇది కేరళ రాష్ట్ర రాజధాని. దక్షిణ భారతదేశంలో పశ్చిమ కోస్తా తీరం దక్షిణ భాగం అంచున ఉన్న ఈ నగరం అనేక సందర్శనీయ ప్రదేశాలను కలిగి ఉండి పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ నగరానికి సమీపంలో ఉన్న బీచ్లు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు మ్యూజియంలు, శిఖరాలు, సరస్సులు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. వీటిని తిలకించడానికి భారత దేశంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి  అందమైన ప్రదేశాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించి ఒక మధుర జ్ఞాపకంగా గుర్తుండేలా చేస్తాయి. అయితే తిరువనంతపురంలో తప్పక సందర్శించవలసిన కొన్ని ప్రదేశాల గురించి ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా తెలుసుకుందాం. 
 

శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం: తిరువనంతపురం నగరం నడిబొడ్డున శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం (Sri Anantha Padmanabha Swamy Temple) ఉంది. ఈ ఆలయ సందర్శన జీవితంలో ఒక్కసారైనా చేయాలి. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణగా విష్ణువు, పద్మనాభ స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారు అనంతశయన ముద్రలో, అనంతుడు అనే సర్పం మీద పడుకొని దర్శనమిస్తారు. స్వామివారి విగ్రహానికి చెరోవైపు శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉంటాయి. ఈ గుడిలోకి వెళ్లే భక్తులు సాంప్రదాయ దుస్తులను (Traditional dress) ధరించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా అల్పిసి ఉత్సవాలు ఆరు నెలలకొకసారి నిర్వహిస్తారు.  
 

నేపియర్ మ్యూజియం: తిరువనంతపురం చరిత్రను తెలియజేసేలా నేపియర్ మ్యూజియం (Napier Museum) ఉంటుంది. ఈ మ్యూజియం లోపల వెలకట్టలేని ఆభరణాలు, కాంస్య విగ్రహాలు, ఏనుగు దంతాలతో చేసిన చెక్కడాలు, ఆలయ రథాలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఈ మ్యూజియాన్ని సహజ హిస్టరీ మ్యూజియం (Natural History Museum) అని కూడా ఉంటారు. ఈ మ్యూజియం నిర్మాణం ఇంగ్లీష్ చైనీస్, మొఘల్, కేరళ శైలి లో ఉంటుంది. తిరువనంతపురం వెళ్లినప్పుడు ఈ విషయాన్ని తప్పక సందర్శించండి.
 

Latest Videos


లైట్ హౌస్ తీరం: ఇది కోవలం సముద్ర తీరానికి (Kovalam sea shore) దక్షిణపు అంచున ఉంది. రాత్రిపూట ఈ తీరం లైట్లతో ప్రకాశిస్తూ అందంగా కనిపిస్తుంది. నగరానికి దగ్గరగా ఉన్న లైట్ హౌస్ తీరాన్ని (Lighthouse shore) సందర్శించడానికి పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఈ తీరం చలికాలంలో కూడా వెచ్చదనాన్ని పంచుతూ చలి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
 

జూలాజికల్ పార్క్: ఈ పార్కు సందర్శన పర్యాటకులకు తప్పక నచ్చుతుంది. జూలాజికల్ పార్కులో (Zoological Park) దాదాపు 75 రకాల పక్షులు, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి తీసుకువచ్చిన జంతువులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఈ పార్కు సందర్శనకు వెళ్ళినప్పుడు మనము ఆసియా సింహం, జిరాఫీ, జీబ్రాలు, నీలగిరి లన్గూర్, రాయల్ బెంగాల్ పులి మొదలైన జంతువులను చూడవచ్చును. జూ లోపల ఏర్పాటుచేసిన సరస్సులో బోటింగ్ (Boating) చేస్తున్నప్పుడు దాహం తీర్చుకోవడానికి వచ్చే వివిధ రకాల పక్షులను చూడవచ్చు
 

హవా తీరం: హవా తీర (Hawa coast) సందర్శన మనసుకు హాయిని కలిగిస్తుంది. ఈ తీరం పచ్చని అందాలతో, నీటితో చూడడానికి అందంగా ఉంటుంది. ఈ హవా తీరంలో స్నానాలు ఆచరించడానికి పర్యాటకులు ఎక్కువ మక్కువ చూపుతారు. రాత్రిపూట చంద్రుని వెన్నెల్లో ఈ ప్రదేశం మరింత అందంగా, సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ఆయుర్వేద మసాజ్ (Ayurvedic massage) చేయించుకుంటూ సముద్రతీర అందాలను ఆస్వాదించవచ్చు.

click me!