కొబ్బరికాయలో పువ్వు..
కొన్నిసార్లు కొబ్బరికాయ పగలకొట్టినప్పుడు పువ్వు కనిపిస్తుంది. ఒక పువ్వు కనిపిస్తే, దీనిని శాస్త్రాలలో శుభప్రదంగా భావిస్తారు. మీరు మీ అన్ని పనులలో విజయం సాధిస్తారని , అది శుభప్రదంగా ఉంటుందని దీని అర్థం.
5. చెడ్డ కొబ్బరికాయ: కొన్నిసార్లు పూజకు సమర్పించిన కొబ్బరి చెడిపోతుంది. అది కుళ్ళిపోతుంది. ప్రజలు దానిని చెడు శకునంగా భావిస్తారు. ఇలాంటి కొబ్బరికాయ కొట్టినప్పుడు తమకు ఏమి జరుగుతుందో అని ఆందోళన చెందుతారు. కానీ దీనికి భయపడాల్సిన అవసరం లేదు. జ్యోతిష్యం ప్రకారం, పూజలో ఉపయోగించే కొబ్బరికాయ చెడిపోతే, దానిని శుభప్రదంగా భావిస్తారు. కొబ్బరిని తల్లి లక్ష్మీదేవితో పోల్చారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది చెడిపోతే, దేవుడు నైవేద్యాన్ని అంగీకరించాడని ఇది సూచిస్తుంది. అందుకే.. కొబ్బరి కుళ్లిపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు.
6. ఎండిన కొబ్బరి: పూజకు నీటితో కూడిన కొబ్బరిని మాత్రమే ఉపయోగిస్తారు. కొన్నిసార్లు కొబ్బరి ఎండిపోతుంది. దీనిని కూడా అశుభంగా భావించాల్సిన అవసరం లేదు. శుభం గానే పరిగణించాలి. కొబ్బరి ఎండిపోతే, మీ కోరికలు త్వరలో నెరవేరుతాయని అర్థం.