ఈ ఒక్క మంత్రం జపిస్తే చాలు.. జీవితంలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాదు!

Published : Sep 24, 2025, 02:28 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంత్రాలకు ప్రత్యేక శక్తి ఉంటుంది. వాటిని జపించడం ద్వారా కోరుకున్నవి జరుగుతాయని చాలామంది నమ్ముతారు. అలాంటి ఒక మంత్రం గురించి ఇక్కడ తెలుసుకుందాం. దాన్ని జపిస్తే కోరుకున్న పదవి దక్కుతుందట. మరి ఆ మంత్రమేంటో తెలుసుకుందామా..

PREV
14
గురువు ఆశీస్సులు పొందాలంటే..

జ్యోతిష్యంలో బృహస్పతిని అత్యంత శుభప్రదమైన గ్రహంగా భావిస్తారు. జాతకంలో గురుబలం బాగుంటే ఆ వ్యక్తికి జ్ఞానం, కీర్తి, సంపద, ప్రజాదరణ, ముఖ్యంగా పదవీయోగం ఖాయం. రాజకీయాల్లో ఎదగాలనుకునేవారికి, ఉన్నత పదవులు చేపట్టాలనుకునేవారికి గురుబలం చాలా ముఖ్యం. గురువు ఆశీస్సులుంటే మీరు కోరుకున్న పదవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని పండితులు చెబుతుంటారు. 

24
ఏ మంత్రం జపించాలంటే..

గురుబలం తక్కువగా ఉన్నవారు విద్య, ఉద్యోగం, పదవికి సంబంధించిన విషయాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. దానికి ఉత్తమ పరిష్కారం మంత్రం పఠించడం. గురువుకు సంబంధించిన మంత్రాలను రోజూ జపిస్తే, ఆయన ఆశీస్సులతో ఆటంకాలు తొలగి, ఉన్నత అవకాశాలు వాటంతట అవే వస్తాయట. 

"ఓం క్రీం గురవే నమః" అనే మంత్రాన్ని రోజూ జపించాలి. ముఖ్యంగా గురువారాల్లో కనీసం 108 సార్లు జపించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. పసుపు రంగు దుస్తులు ధరించి.. పసుపు రంగు పూలతో గురువును పూజించడం శ్రేయస్కరం.

34
దానం చేయడం..

గురు పూజా సమయంలో దానం చేయడం, ముఖ్యంగా విద్యకు సంబంధించిన సహాయం చేయడం చాలా మంచి పరిహారం. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం వంటివి గురు దృష్టిలో గొప్ప పుణ్యకార్యాలు. దానివల్ల పదవీ యోగమే కాకుండా ప్రజాదరణ, గౌరవం, పలుకుబడి కూడా పెరుగుతాయి.

44
మంత్రాన్ని సరిగ్గా జపిస్తే..

అధికారంపై ఆశ ఉన్నవారు, రాజకీయాల్లో ఎదగాలనుకునేవారు ఈ మంత్రాన్ని సరిగ్గా జపిస్తే వారికున్న ఆటంకాలు తొలగి..  ప్రజలు అంగీకరించే నాయకుడిగా ఎదిగే అవకాశం ఉందట. జాతకంలో గురుబలం తోడైతే వెనక్కి తిరిగి చూడల్సిన అవసరం రాదని పండితులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories