కొన్నిసార్లు పూజ చేస్తున్నప్పుడు కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. చెయ్యి జారి పసుపు, కుంకుమ కింద పడడం లేదా హారతి పళ్ళెం కింద పడడం వంటివి జరుగుతాయి. ఇవి వాస్తు శాస్త్ర పరంగా ప్రత్యేక సంకేతాలేనని చెబుతున్నారు జ్యోతిష్శాస్త్ర నిపుణులు.
పూజలో హారతి ఇవ్వడం ముఖ్యమైన భాగం. హారతి ఇవ్వడంతో పూజ చివరి దశకు చేరుకుంటుంది. అప్పుడప్పుడు పూజ ప్లేటు కొంతమంది చేతుల్లోంచి అకస్మాత్తుగా కింద పడిపోతుంది. అప్పుడు ఎంతోమంది ఆందోళన చెందుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు చేతి నుంచి కింద పడిపోవడం అనేది కొన్ని ప్రత్యేక సంకేతాలను తెలుపుతుందని చెబుతున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. పూజ పళ్ళెం లేదా హారతి పళ్ళెం లేదా గాజు వస్తువులు వంటివి చేతిలోంచి కింద పడితే దానికి అర్థం ఏంటో వివరిస్తున్నారు.
25
అశుభ సంకేతాలను తెలిపేవి
చాలామందికి ఇలాంటి సంఘటనలు ఇంట్లో ఎదురయ్యే ఉంటాయి. అనుకోకుండా చేసిన తప్పే అయినా కూడా అది ఒక్కోసారి చెడు పరిణామాలకు దారితీస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం హారతి ప్లేట్ చేతిలోంచి కింద పడిపోవడం లేదా చేతిలోనే గాజు వస్తువులు కిందపడి పగలడం లేదా చేతిలోని నీటి చెంబు నీటితో సహా కింద పడి పోవడం వంటివి జరుగుతాయి. ఇవి మనకు భవిష్యత్తులో జరిగే కొన్ని శుభ,అశుభ సంకేతాలను అందిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఏ ఏ సంఘటనలో ఎలాంటి భవిష్యత్తు ఘటనలను సూచిస్తాయో తెలుసుకోండి.
35
హారతి పళ్లెం కింద పడితే
పూజ చేస్తున్నప్పుడు హారతి పడడం లేదా పూజ సామాగ్రి ఉన్న పళ్లెం చేతుల నుండి కింద పడిపోతే అది అశుభ సంకేతమేనని వాస్తు శాస్త్రం చెబుతోంది. దేవుడు మీ పూజను అంగీకరించడం లేదని ఆ చర్యతో చెబుతున్నట్టేనని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.పూజలో మీరు చేసిన ఏదో ఒక నిర్లక్ష్యం కారణంగానే దేవుడికి కోపం వచ్చివచ్చు అని కూడా నమ్ముతున్నారు.
45
నీటి చెంబు కింద పడితే
కొంతమంది పూజ కోసం నీటిని చెంబులో తీసుకెళుతూ ఉంటారు. అది అకస్మాత్తుగా కింద పడిపోతుంది. అది కూడా శుభప్రదమైనది కాదు. దీని అర్థం మీ పూర్వీకులు ఏదో విషయంలో అసంతృప్తితో ఉన్నారని, త్వరలో మీ ఇంటి తలుపు తట్టబోతున్నారని అర్థం. కాబట్టి మీ పూర్వీకులను సంతృప్తిపరిచేందుకు ఏం చేయాలో ఆధ్యాత్మిక నిపుణులను అడగాల్సిన అవసరం ఉంటుంది.
గాజు వస్తువులు పగిలిపోవడం కూడా మంచిది కాదు. వాస్తు శాస్త్రం దీన్ని అశుభ సంకేతంగానే చెబుతోంది. గాజు పగలడం అనేది జీవితంలో ఘర్షణలు, ఆందోళనలు, ఒత్తిడిని సూచిస్తుందని వివరిస్తుంది. ఇంట్లో పగిలిన అద్దాలు, గాజు వస్తువులు ఉంచుకోకూడదు. ఇది ప్రతికూల శక్తిని ఇంట్లో పెంచుతాయి. అదృష్టాన్ని తగ్గిస్తాయి.
55
బియ్యం కిందపడితే
వంట గదిలో పనులు చేసేటప్పుడు చేతిలో నుంచి గోధుమలు,బియ్యం వంటివి అనుకోకుండా కింద పడిపోతాయి.ఇలా జరగడం శుభప్రదం కాదు. నేలపై ధాన్యాలు పడేయడం అనేది అన్నపూర్ణమ్మ దేవిని అవమానించడమే.. కాబట్టి ఆహార దేవత కోపగించుకోవచ్చు. దీనివల్ల ఆర్థిక కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైనా బియ్యం అనుకోకుండా కింద పడితే లేదా బియ్యాన్ని అనుకోకుండా కాలితో తొక్కితే వెంటనే వాటిని చేతితో తీసి మీ నుదుటిపై పెట్టుకోండి. లక్ష్మీదేవిని, అన్నపూర్ణాదేవిని క్షమించమని అడగండి. బియ్యాన్ని అగౌరవపరిస్తే జీవితంలో సంపద, శాంతి దూరమైపోతాయి.