అవసరంలో ఉన్నవారిని మొదటగా గుర్తించండి. వారు ఖచ్చితంగా పేదవారై ఉండాలి. శ్రావణమాసంలోని పౌర్ణమి నాడు ఆ పేదలకు అవసరమైన ఆహారము, దుస్తులు, డబ్బు వంటివి దానం చేయండి. మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. శివుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ దానాన్ని ఎంతో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈ దానం వల్ల మీ జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. దానం చేసే వ్యక్తి వాటిని ఆనందంగా, సంతృప్తిగా తీసుకునేటట్టు చేయాలి. ఆ వ్యక్తికి పొట్ట నిండేంత ఆహారాన్ని దానం చేయడం మర్చిపోవద్దు. మీరిచ్చే దానాన్ని చూసి ఎదుట వ్యక్తి సంతృప్తి పడితేనే మీకు ఆ దాన ఫలితాలు దక్కుతాయి.