తులసి మొక్క లోకాధిపతి అయిన విష్ణువుకు ప్రీతికరమైనదని నమ్ముతారు. అలాగే ఈ పవిత్రమైన మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని కూడా నమ్ముతారు. అందుకే ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మొక్క దగ్గర దీపాలు వెలిగించి పూజ చేస్తారు. దీనివల్ల మీకు శుభఫలితాలు లభిస్తాయని, సకల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అయితే తులసి పూజకు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. వాటిని పాటించకపోవడం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే తులసి కి పూజ చేసేటప్పుడు కొన్ని విషయాలను మరచిపోకూడదు. దీని వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ నివసిస్తుంది.