వేపచెట్టుకు పూజ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

First Published | Jun 1, 2024, 11:50 AM IST

వేప ఎన్నో ఔషదగుణాలున్న చెట్టు. ఈ చెట్టు ఆకుల నుంచి బెరడు వరకు ప్రతి ఒక్కటీ మన  ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేస్తుంది. అయితే హిందూ సంప్రదాయంలో వేపచెట్టును పూజించే ఆచారం కూడా ఉంది. అసలు వేపచెట్టుకు పూజ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? 

neem tree


హిందూమతంలో వేపచెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ వేపచెట్టును పూజిస్తే దేవతలు, దేవుళ్లు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు. ఈ చెట్టుపైనే దేవుళ్లు నివసిస్తారని నమ్ముతారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తుంటారు. వేపచెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే వేపచెట్టును పూజించడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

దేవతలు నివసిస్తారు

మత గ్రంథాల ప్రకారం.. వేపచెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతా మాత. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు. రోజూ పూజ చేస్తారు.
 


నెగిటివిటీ పోతుంది.

వేప చెట్టును పూజించడం వల్ల మనం సకల బాధలనుంచి బయటపడతామని జ్యోతిష్యులు చెబుతారు. వేపచెట్టును పూజిస్తే కుటుంబంలో, మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా. 

శని దోషం తొలగిపోతుంది.

శనిదోషం ఉంటే ఎక్కడ లేని సమస్యలు మనల్నే చుట్టుకుంటాయి. అందుకే శనిదోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. అయితే మీకు శనిదోషం ఉంటే రోజూ వేపచెట్టును పూజించాలి. ఇది శని దోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది.

కేతువు చెడు ప్రభావం నుంచి రక్షణ

కేతువు చెడు నీడ ఒకరి జీవితంలో నివసిస్తే.. వాళ్లు తమ జీవితలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఇది ఒక సమస్య పోగానే మరొక సమస్య వచ్చేలా చేస్తుంది. అందుకే ఇలాంటి పరిస్థితిలో మీరు వేప చెట్టును పూజిస్తే కేతువు  చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

ఆశీస్సులు 

వేపచెట్టును స్వచ్ఛమైన మనసు, శరీరంతో పూజించిన వారికి దేవతల ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు. అలాగే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.

pitru dosh

దుష్ట శక్తులు దూరమవుతాయి.

వేపచెట్టును పూజించడం వల్ల ఎన్నో దైవానుగ్రహం పొందుతారు. అలాగే ఇది మీ ఇంట్లో దుష్ట శక్తులను నశించేలా చేస్తుంది. దీనితో ఎవరి చెడు కన్ను మిమ్మల్ని తాకదు. దిష్టి తాకదు. వేపచెట్టును పూజించడం వల్ల పితృ దోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే పూర్వీకుల ఆశీస్సులు కూడా మీపై  ఉంటాయి. 

Latest Videos

click me!