తల్లిదండ్రులను గౌరవించని వారికి గరుడ పురాణం ఎలా శిక్షిస్తుందో తెలుసా?

First Published | Jun 1, 2024, 10:50 AM IST

ఈ రోజుల్లో చాలా మందికి తల్లిదండ్రులను తక్కువ చేసి చూడటం, అవమానించడం కామన్ అయిపోయింది. అయితే... అలాంటి వారికి చనిపోయిన తర్వాత.. నరకంలో భయంకరమైన శిక్ష ఉంటుందట.

హిందూ ధర్మం ప్రకారం..  గరుడ పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనం చేసే మంచి, చెడులకు ఫలితాన్ని ఈ గరుడ పురాణం నిర్ణయిస్తుంది. మనం మంచి చేసినప్పుడు ఎలాంటి కర్మ అనుభవిస్తామో, చెడు చేసినప్పుడు ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో.. ఈ గరుడ పురాణం మనకు చెబుతుందట.

ఈ గరుడ పురాణం ప్రకారం,...  ఎవరైతే తల్లిదండ్రులు, గరువును గౌరవించరో.. వారికి  చనిపోయిన తర్వాత.. చాలా కఠినమైన శిక్షలు పడతాయట. ఈ రోజుల్లో చాలా మందికి తల్లిదండ్రులను తక్కువ చేసి చూడటం, అవమానించడం కామన్ అయిపోయింది. అయితే... అలాంటి వారికి చనిపోయిన తర్వాత.. నరకంలో భయంకరమైన శిక్ష ఉంటుందట.

Latest Videos


వారిని వైతరిని నదిలో పడేస్తారట. ఈ వైతరినీ నదిలో అన్ని నదుల్లోలాగా నీళ్లు ఉండవట. రక్తం ఉంటుంది.  అది కూడా... ఎప్పుడూ ఉడుకుతూ ఉంటుంది. లావాలో  పొంగి పొర్లుతూ ఉంటుందట. అందులో పడినప్పుడు.. ఆ ఉడికే రక్తంలో  పడటం వల్ల.. చాలా నొప్పిగా  ఉంటుందట. ఆ నొప్పితో విలవిల లాడుతుంటుండగానే... తీసుకువెళ్లి నరకంలో పడేస్తారట.

కేవలం, తల్లిదండ్రులను మాత్రమే కాదు.. గురువులను గౌరవించని వారికి కూడా ఇలాంటి శిక్షే వేస్తారట. అంతేకాదు.. ఎవరైతే ఇతరులను మోసం చేయాలని చూస్తారో... భార్యలను చిత్ర హింసలు పెట్టే భర్తలకు  కూడా ఇంతే ఘోరమైన శిక్షలను వేస్తారట.

ఇక... మంచి మనసు ఉన్న వ్యక్తులపై నిందలు వేసే వారికి కూడా గరుడ పురాణం ప్రకారం.. వైతరిని నదిలో వేసి శిక్షిస్తారట.  కాబట్టి.. ఇలాంటి పొరపాట్లు చేయకూడదని గరుడ పురాణం మనకు చెబుతోంది.

click me!