అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, శ్రీ కనకదుర్గమ్మ. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై భక్తుల కోరికలను తీర్చే ఈ తల్లి ఆలయం విజయవాడ నగరంలోని కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఈ గుడికి పెద్ద చరిత్ర ఉంది కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేశాడు.
ప్రత్యక్షమైన అమ్మవారిని తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీలుని పర్వతం గా నిలబడమని ప్రత్యేకంగా రాక్షసి సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాట ఇచ్చింది. పర్వతంగా మారి అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.
అయితే అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు అక్కడికి తరచూ రావడం వలన వేలాద్రి కాస్త ఇంద్రకీలాద్రిగా మారింది. ఈ ఆలయానికి హిందూ పురాణాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది.
ఇక్కడ వెలిసిన మహిషాసుర మర్దిని కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడు కొరకు తపస్సు చేసి శివుడు నుండి పాశుపతాస్త్రం పొందాడు కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభువుగా వెలసింది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ ఆలయానికి వచ్చి అమ్మని దర్శనం చేసుకుంటారు. ఈ దేవాలయానికి వచ్చేవారు..
దేవాలయం మెట్లమీద రాళ్లు పెడితే సొంతింటి కల నెరవేరుతుందని విశ్వాసం చాలామందిలో ఉంది. అలాగే జ్యోతిర్లింగ రూపంలో శివుడు ఇక్కడ వెలిశాడు. స్వామిని బ్రహ్మదేవుడు మళ్లీ కదంబ పుష్పాలతో పూజించడం వల్ల స్వామివారిని మల్లికార్జునుడు అంటారు.