అప్పుడు చంద్రఘంట దేవి త్రిమూర్తుల అనుమతి తీసుకొని మహిషాసురుడితో యుద్దానికి సిద్ధమవుతుంది. కాలక్రమేణా చంద్రఘంట దేవి మహిషాసురుడికి మధ్య భీకర యుద్ధం జరిగిందని పురాణాల్లో ఉంది. ఈ యుద్ధంలో మహిషాసురుడు చంద్రఘంటికదేవి ముందు నిలబడలేకపోయాడు. ఆ సమయంలో మహిషాసురుడిని వధించి తల్లి ముల్లోకాలను కాపాడింది. తల్లి రోదనలు ముల్లోకాల్లో ప్రతిధ్వనించాయి. రాక్షసుడి నుంచి మూడు లోకాలను కాపాడినందుకు చంద్రఘంటిక దేవతను ప్రతి ఒక్కరూ పూజిస్తారు. అమ్మవారు తన భక్తుల దుఃఖాలన్నిటినీ జయిస్తుంది. అలాగే ఆనందం, శ్రేయస్సు , శాంతిని కూడా అందిస్తుంది. అందుకే శారదా నవరాత్రులలో మూడో రోజు భక్తులు చంద్రఘంట దేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.