హిందువులలో పండగలకే కాదు ప్రతి చిన్న విషయానికి కూడా దేవుడికి మొక్కుకోవడం ఒక సాంప్రదాయం వాటిలో ఉపవాసం ఒకటి. ఉపవాసం ఎలా పడితే అలా చేయకూడదు అంట దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది అలా చేస్తేనే పుణ్యము పురుషార్దమూను లేదంటే మీ కోరికలు నెరవేరవంట.
ఆ పద్ధతులు ఏంటో చూద్దాం. ఉపవాసం ప్రారంభించే ముందు తీర్మానాన్ని తీసుకోవడం మర్చిపోవద్దు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ తీర్మానం తీసుకోవాలి. అప్పుడే సమయ వ్యవధిని కూడా నిర్ణయించుకోవాలి.
తీర్మానం లేకుండా చేసినా ఉపవాస ఫలితం ఉండదట. కాబట్టి తీర్మానం తీసుకున్నకే ఉపవాసం ప్రారంభించండి. అలాగే ఉపవాసాల్లోని నాలుగు రకాలు ఉంటాయి అవి నిర్జలోపాసం, జలోపవాసం, రశోపవాసం, ఫలోపవాసం. ఈ నాలుగు ఇంట్లో ఏ ఉపవాసం చేసినా మంచిదే.
మీ ఒంట్లో ఓపికని బట్టి మీకు ఏది వీలవుతుందో ఆ ఉపవాసాన్ని ప్రారంభించండి. ఉపవాసంలో ఉండేటప్పుడు ఫ్రిడ్జ్ లో ఉండే నీళ్లు కానీ పండ్లు కానీ తినకండి సహజంగా ఉండే నీటిని మాత్రమే త్రాగండి. అలాగే పళ్ళు కూడా ఫ్రెష్ వి తినండి. అలాగే పండ్ల రసాలు కూడా తీసుకోవచ్చు.
ఉపవాసం ఉండేటప్పుడు ఎట్టి పరిస్థితులలోనూ నల్లని దుస్తులు ధరించకండి వీలైతే పసుపు తెలుపు రంగుల దుస్తులను ధరించండి. అలాగే ఉపవాస సమయం లో మీ మనసుకి ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రానీయకుండా చూసుకోండి. మనసుని భగవంతుని మీద మాత్రమే లగ్నం చేయండి.
బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించవలసిన నియమం. అయితే ఇందులో కొన్ని నియమాలు పిల్లలకి గర్భిణీ స్త్రీలకు వయోవృద్ధులకి సందర్భాన్ని బట్టి మినహాయింపు ఉంటుంది. కాబట్టి నియమాలను పాటిస్తూ ఉపవాసం చేస్తే స్వామి కార్యము స్వకార్యము రెండు చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే ఉపవాసం శరీరానికి చాలా మేలు చేస్తుంది.